తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైయస్ఆర్‌సీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.