గన్నవరం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు

కృష్ణా జిల్లా: గన్నవరం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పరువు నష్టం కలిగించే విధంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న వారి వివరాలు, ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. అలాగే వీడియోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై నిన్న మచిలీపట్నంలో పిజీఆర్ఎస్ ద్వారా మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి కూడా వంశీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 

Back to Top