పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సామాజిక సాధికారయాత్ర విజయవంతమైంది. యాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. ఎండమండుతున్నా ప్రజలంతా కదలకుండా సభ ఆసాంతం ఉన్నారు. పత్తికొండ బహిరంగసభలో డిప్యూటీసీఎం అంజాద్ బాషా, మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఆదిమూలపు సురేష్, ఎంపీ సంజీవ్‌కుమార్, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ... – దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిపోయాయి. సామాజిక న్యాయం మాత్రం నినాదంగానే మిగిలిపోయింది. – మన రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి కాగానే పరిస్థితి మారిపోయింది. సామాజిక సాధికారత అన్నది ఒక విధానం అయింది. – తన మంత్రివర్గంలో 17 మందిని అంటే 70 శాతం మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చోటిచ్చిన జగనన్న. – ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో.. నాలుగింటిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారు. – అణగారిన వర్గాలను చేయిపట్టి ముందుకు నడిపిస్తున్న జగనన్న, నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. – 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఏనాడు బీసీలు గుర్తురాలేదు. మైనార్టీలు గుర్తుకు రాలేదు. ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అంటే నమ్మేదెవరు? – మళ్లీ ప్రజల ముందుకు వస్తున్న బాబు గతాన్ని మరిచిపోవద్దు. హామీలిచ్చి ఎగ్గొట్టే నైజం చంద్రబాబుది. మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.... – భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సామాజిక సాధికారత పెద్ద విషయం కాదు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న సామాజిక సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. – బీసీల కులగణనకు అంగీకరించిన జగనన్న.. బీసీలందరికీ న్యాయం చేయాలని భావిస్తున్నారు. – వెనుకబడిన వర్గాల వారు నేడు ఆత్మగౌరవంతో.. తలెత్తుకు తిరుగుతున్నారంటే అది జగనన్న చలవే. – చంద్రబాబు హయాంలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని చులకనగా చూశారు. అవహేళన చేశారు. అవమానాల పాలు చేశారు. – నేడు జగనన్న పాలన మంచికి, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. – మహిళా సాధికారత విషయంలోనూ జగనన్న చేస్తున్న మంచి అంతా ఇంతా కాదు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ..... – జగనన్న పాలనలో అవినీతి రహిత సమాజాన్ని చూస్తున్నాం. – ఎలాంటి వివక్షకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందడం ఇప్పుడే చూస్తున్నాం. – జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో మన తలరాతలు మారాయి. – మన బతుకులు, మన కుటుంబాలు, మన పిల్లల తలరాతలు మారాయన్నది నిజం. – చట్టసభల్లో ఎప్పుడూ అడుగుపెట్టని కొన్ని కులాలను పార్లమెంటు వరకు తీసుకెళ్లిన ఘనత జగనన్నది. – అంబేడ్కర్, పూలే ఆదర్శాలతో మన చేతులు పట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న మనసున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. – మన బతుకులు బాగుపడతాయి. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలు.. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. – జగనన్న లాంటి నాయకుడు మరొకరు లేరు. మళ్లీ రారు. – జగనన్నను నమ్మాం. నమ్మినందుకు ఆయన మనకు ఎంతో మేలు చేసి చూపారు. – గతంలో చంద్రబాబును నమ్మినందుకు...ప్రజలను ఎంత మోసం చేశారో అందరికీ తెలుసు. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన రాజకీయ నాయకుడు, మోసకారి చంద్రబాబు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.... – ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసింది జగనన్నే. మన తలరాతలు మారుస్తోంది జగనన్నే. – అట్టడుగు వర్గాలకు చెందిన మనకు నాయకులయ్యే అవకాశం జగనన్న వచ్చాకే వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు రాలేదు. – మన రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మాత్రం జగనన్న వచ్చాకే స్వాతంత్య్రం వచ్చింది. – బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలంతా.. నా మనుషులు అంటూ ఆయా వర్గాలను జగనన్న సొంతం చేసుకున్నారు. – అట్టడుగు వర్గాలకు చెందిన వారిని పైకి తెచ్చే నాయకుడు జగనన్నే. – ఈరోజు పింఛన్లు అందుకుంటున్నవారు జగనన్నను పెద్దకొడుకులా చూస్తున్నారు. ఎంపీ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ.... – ఇది పేదల రాజ్యం. బీసీల రాజ్యం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యం. – ఇప్పుడు మన తలరాతలు మారుతున్నాయి. మన తాతల కాలం పోయింది. – మన పెద్దలు కుల వివక్షతో ఎన్ని బాధలు పడ్డారో మనకు తెలుసు. పనుల కోసమే మనల్ని అగ్రవర్ణాల వారు వాడుకున్నారు. – కానీ ఇప్పుడు కాలం మారింది. మనకు జగనన్న ఉన్నారు. ఇప్పుడు మనం బండి పైకి ఎక్కి.. ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. – జగనన్న మనల్ని కాపాడాడు. మనం ఆయన్ను కాపాడుకోవాలి. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కథలు చెప్పి మోసం చెయ్యడానికి చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు. వారిని తరిమేద్దాం. వారికి ఓట్లేయకండి. – జగనన్నను గెలిపించుకుందాం. అణగారిన వర్గాల ప్రభుత్వాన్ని నిలుపుకొందాం. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.... – సామాజిక సాధికారత జగనన్న వల్లే సాధ్యమైంది. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలిచి, అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – సంక్షేమ పథకాల వెల్లువతో బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపారు. – జగనంటే జనం.. జనమంటే జగన్ – గతంలో మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినవాళ్లు, మంత్రులైన వారున్నారు. చేసింది మాత్రం ఏమీ లేదు. ఇక్కడ సాగునీటి కోసం జగనన్న చేసిన మేలు అంతా ఇంతా కాదు. – రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జిల్లాకు చెందిన నలుగురికి ఛైర్మన్ పదవులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 440 డైరెక్టర్లలో కర్నూలుకు 32 ఇచ్చారు. – ఇందులో 18 అంటే 50 శాతానికి మించి పోస్టులు బడుగు, బలహీన వర్గాలకు కట్టబెట్టారు. – నామినేటెడ్ పదవుల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ, డీసీఎంఎస్‌తో పాటు 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కట్టబెట్టారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయా వర్గాల అభ్యర్థులను నిలిపి గెలిపించారు.