పోటెత్తిన ప‌త్తికొండ‌

వైయ‌స్ఆర్‌సీపీ సామాజిక సాధికార యాత్ర‌కు విశేష స్పంద‌న‌

క‌ర్నూలు: అశేష జనవాహిని వెంట నడవగా క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ‌ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర పోటెత్తింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు తరలివచ్చారు. వైయ‌స్ జగనే మా నమ్మకం అంటూ... దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు నియోజకవర్గంలో విశేష స్పంద‌న ల‌భించింది. ప‌త్తికొండ ప‌ట్ట‌ణంలో అశేష జనవాహిని విశేష స్వాగతం మధ్య జైత్రయాత్రగా సాగింది. అడుగడుగునా జనం బస్సు యాత్రలో వచ్చిన నేతలకు అపూర్వంగా స్వాగతించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని నాలుగున్నరేళ్లలో సాగించిన అభివృద్ధి పనులను నేతలు పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైయ‌స్ఆర్‌ సీ ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన బస్సు యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ  తో పాటు రాష్ట్ర మంత్రులు అంజద్ బాష, ఉషా శ్రీ చరణ్, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, కర్నూలు మేయర్ బి వై రామయ్య, ఎంపీ సంజీవ్ కుమార్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీలు మధుసూదన్, రమేష్ యాదవ్ తదితర నేతలు బస్సుపై ప్రదర్శనగా గుత్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీతో వచ్చారు. వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ బస్సు యాత్రకు స్వాగతం పలికారు.  గిరిజన మహిళలను నృత్యాలు, గురవయ్యల సాంస్కృతిక ప్రదర్శన, కోలన్నల ఉత్సాహం మధ్య ర్యాలీ అట్టాహసంగా జరిగింది. వెనుకబడిన తరగతుల, అణగారిన వర్గాలకు అభివృద్ధికి సహకార అందించే నేత దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్ బాష, రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్ అన్నారు. వైయ‌స్ఆర్‌ సీపీప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. గతంలో పాలకులు అనగారిన వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. జగనన్న ఇచ్చిన స్ఫూర్తితో పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూ, మరోవైపు సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. జగనన్న మంత్రివర్గాన్ని చూస్తే సామాజిక న్యాయాన్ని ఎలా పాటిస్తున్నారు అని అర్థమవుతుందని మంత్రులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అర్హత ప్రమాణికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి జగనన్న కృషి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.  

తాజా వీడియోలు

Back to Top