టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ..

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

విజయవాడ: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని గుర్తు చేశారు. శుక్ర‌వారం మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ విజ‌య‌వాడ న‌గ‌రంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంకార్య‌క్ర‌మం నిర్వ‌హించి ప్ర‌తి ఇంటికి వెళ్లి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై ఆరా తీశారు. ఇదే క్ర‌మంలో టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య ఇంటికి కూడా వెల్లంప‌ల్లి వెళ్లి ఆ ఇంటికి ప్ర‌భుత్వం నుంచి అందిన సంక్షేమ ప‌థ‌కాల క‌ర‌ప‌త్రాన్ని డ్రైవ‌ర్‌కు అంద‌జేశారు. టీడీపీ నేత వర్ల రామయ్య కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. బుద్ధిలేని బుద్దా వెంకన్నకు సిగ్గులేదని విమర్శించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ బుద్ధా వెంకన్న అని గుర్తు చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top