తిరుపతి: మహిళలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే బాధేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కూటమి పాలనలో 120 రోజుల్లో 110కిపైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. అధికారులతో పని చేయించుకోవటం రాకపోతే రాజీనామా చేయండి అన్నారు. మంచి అధికారులపై వైయస్ఆర్‌సీపీ ముద్ర వేసి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు శాఖపై నేరస్తుల్లో భయం పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రోజాను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని భార్యను ఆస్పత్రి లోపలికి అనుమతిస్తారు. మాకు ఎందుకు ఇవ్వరు? బిహార్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు జరిగేవి, ఈరోజు ఏపీలో రోజు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులుపై ఒత్తిడి చేశారు. అమ్మాయి తల్లిదండ్రులుపై ఒత్తిడి తీసుకువచ్చి.. ఉదయానికి మాట మార్చారు. పోలీసు ఉన్నతాధికారులుపై ఎంత ఒత్తిడి చేస్తున్నారో అర్థం చేసుకోగలం. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అనిత డమ్మీ హోం మంత్రి.. వైయస్ జగన్‌ను తిట్టడానికే పదవి ఇచ్చారు. పవన్ కల్యాణ్ అధికార పక్షంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? సమాధానం చెప్పకుండా పవన్ తప్పించుకుంటున్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని హోం మంత్రే చెబుతున్నారు. బెల్ట్ షాపుల వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. సరస్వతి భూముల పరిశీలనకు ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ముందు బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాలకు న్యాయం చేయండి. ఆంధ్రాలో అరాచకాలు జరుగుతుంటే..మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించటం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరు కలిసి పోలీసులను బదిలీలు చేయించారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకునే వాళ్లకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. పని చేయడానికి శాఖతో పనిలేదు. గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు. వాళ్లను ప్రైవేటు వెహికిల్స్‌లో ఇంటికి పంపించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఫెయిల్ అయ్యారు. సరస్వతి భూములు ఎక్కడికి పోవు, ఋషికొండకు ఎందుకు వెళ్లాలి? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రధాని మోదీకి చేతులు జోడించి చెప్తున్నాం. ఏపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు(బీజేపీ) కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగ్‌లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. పిఠాపురంలో టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనపై కనీసం ఇప్పటి వరకు ఎవ్వరూ పరామర్శించలేదని రోజా అన్నారు.