శ్రీకాకుళం: వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంతో డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆర్థిక భరోసా లభించిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకూర్మం(గార మండలం) లో జరిగిన వైయస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మహిళా సంఘాలను, రైతులను మోసం చేశారు. 2018-19 లో ఇప్పటి సీఎం,అప్పటి విపక్ష నేత జగన్ పాదయాత్రలో చెప్పినట్లుగా నాలుగు దఫాలలో చెల్లిస్తాం అని చెప్పారు. పూర్తి చేశారు. ఫిబ్రవరిలో వైయస్ఆర్ చేయూత పథకం అందించేందుకు మళ్ళీ వస్తాం. 5 ఏళ్ల ఈ ప్రభుత్వ కాలంలో ఎన్నికల ముందు చెప్పినవన్నీ చేశాం. సంక్షేమం ఒక ఎత్తు అయితే, గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడులు,సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్, రోడ్ల నిర్మాణం అన్నవి మరో ఎత్తు. ఇవి అన్నీ అభివృద్ధి కాదా .. ? పేద పిల్లలు గౌరవంగా ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. ఇందుకు కారణం ఎవరో.. గుర్తించి రానున్న ఎన్నికల్లో వారి కోసం పని చేయాలి. చంద్రబాబుకు ఆ రోజు అధికారం ఉన్న నాడు ఖజానా అంతా దోచుకున్నారు. సీఎం జగన్ మాత్రం పేదల స్థితి,గతులు పెంచేందుకు కృషి చేస్తున్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని నమ్మకుండా,ఈనాడు,ఆంధ్రజ్యోతి పేపర్స్ చూస్తే ఏం వస్తుంది.? వాళ్లు అందరూ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలు ఎవరూ అనడం లేదు. పథకాల అందలేదని, వివక్ష చూపారని,ధన బలం, కండబలం,కులబలం చూశారని ఎవరూ అనడం లేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పంచి పెడుతున్నాడు..ఇస్తున్నాడు..అని అంటున్నారు కానీ ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడం లేదే ? మన నాయకుడుకు ఉన్న గుడ్ విల్ అది. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతోంది. మళ్ళీ ఓటు వేసి అధికారం ఇస్తేనే వైయస్ జగన్ ముఖ్య మంత్రి అయ్యి,ఇప్పుడు అమలవుతున్నవి అన్నీ కొనసాగుతాయి. ఆరోగ్య కోసం ఆస్పత్రుల మార్పు,పిల్లల చదువు కోసం బడుల మార్పు చేశాం. పరిపాలనను మీ ఇంటి వద్దకే తెచ్చింది ఈ ప్రభుత్వం. ఉదయం లేచి అందంగా తయారై పిల్లలంతా బడులకు వెళ్తుంటే .. ఆ కుటుంబానికి సమాజంలో గౌరవం తెప్పించిన ఈ ప్రభుత్వం కోసం ఏవో పేపర్స్ లో రాస్తేనో.. చూస్తేనే తెలుస్తాదా.. వాటి ఫలాలు అందుకుంటున్న మన అందరికీ తెలీదా.. ? మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అంటున్నారు. మహిళలను మళ్ళీ మోసం చేయడానికి చంద్రబాబు దొంగ హామీ ఇస్తున్నారు. ఇప్పుడున్న కరెంట్ ఛార్జీలు పెంచను అని చెబుతున్నారు కానీ తగ్గించను అని చెప్పడం లేదు. ఇంతోటి దానికి చంద్రబాబుకు ఓటెందుకు వెయ్యాలి ? పేదలను సామాజికంగా,ఆర్థికంగా నిలబెట్టిన ప్రభుత్వానికి మరొక్క సారి మద్దతు తెలపండి..అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ అందవరపు సూరిబాబు,డీఆర్డీఏ విద్యా సాగర్,డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, వైయస్ఆర్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు,ఎంపీపీలు గొండు రఘురాం,అంబటి నిర్మలా శ్రీనివాస్, జెడ్పీటీసీలు మార్పు సుజాత, రుప్ప దివ్య, ఎఎంసి ఛర్మన్ ముకళ్ల తాత బాబు, మండల పార్టీ అధ్యక్షులు చిట్టి జనార్దన రావు,పీస గోపి,సర్పంచ్లు చల్ల వాని దేవి, జి.అనిత, నాయకులు చల్లా రవి కుమార్,బరాటం నాగేశ్వర రావు,ముంజేటి కృష్ణ,మార్పు పృధ్వి,అరవల రామకృష్ణ ,అందవరపు బాలకృష్ణ పాల్గొన్నారు.