రాయచోటి: పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ, వారి త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న నేతలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. దేశ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మూలసూత్రాలను ప్రజల్లో మరింత బలంగా చాటిచెప్పాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సీపీ పట్టణ కన్వీనర్ నవాజ్, కౌన్సిలర్లు కొలిమి చాన్ బాష్, షబ్బీర్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, వైఎస్ఆర్ సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రియాజుర్ రెహమాన్, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, టెలికాం సభ్యుడు అబుజర్, వినియోగదారుల ఫోరమ్ నియోజకవర్గ కన్వీనర్ జానం రవీంద్ర యాదవ్, బీసీ సెల్ నాయకుడు విజయ భాస్కర్, మైనారిటీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ నవాజ్ క్రిష్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, కో–ఆప్షన్ సభ్యురాలు మైమూన్, ఎస్సీ సెల్ రాయచోటి మండల అధ్యక్షుడు రెడ్డెయ్య, కెటీసీ యూసుఫ్, ఖలీల్, యూసుఫ్, సాధక్ అలీ, హాజరత్ ఖాదర్ వలీ, ఉమర్, దర్బార్, అశోక్, ఫైరోజ్, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.