సూళ్లూరుపేట‌లో  " రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో " 

నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో శ‌నివారం " రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో " అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే , సూళ్లూరుపేట నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య  ఆధ్వర్యంలో నిర్వహించిన " బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ " కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి , సూళ్లూరుపేట ఎంపీపీ & పార్టీ మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Back to Top