చిత్తూరు : చావులను కూడా రాజకీయంగా వాడుకోవడంలో తమకెవరూ సాటి రారని వెన్నుపోటు పార్టీ నేతలు నిరూపించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జంపనూరు గ్రామానికి చెందిన రాజేంద్రన్‌ను గురువారం వానగుట్టపల్లిలో ఎన్నికల ఆర్వో కారు ఢీకొని.. ఈడ్చుకెళ్లడంతో మృతి చెందిన విషయం విదితమే. వానగుట్టపల్లి సర్పంచ్‌గా అనిత గెలుపొందినట్లు తెలియగానే టీడీపీ శ్రేణులు.. లైట్లు ఆపేసి, ఎన్నికల సిబ్బంది, వారి వాహనాలపై దాడిచేసి ఫలితాలు తారుమారు చేసేందుకు యత్నించడమూ తెలిసిందే. ఆ సమయంలో టీడీపీ మూకలు ఆర్వో వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ ఆ వాహనాన్ని వేగంగా తీసుకెళ్తుండగా, రోడ్డు పక్కనే ఉన్న వైయస్సార్సీపీ కార్యకర్త రాజేంద్రన్‌ను ఢీకొని.. కిలోమీటర్ దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. అప్పటికే రాజేంద్రన్ విగత జీవిగా మారారు. ‘ఇతను ముమ్మాటికి వైఎస్సార్సీపీ కార్యకర్తే. 2026 ఏప్రిల్ 10న వైఎస్సార్సీపీ సభ్యత్వం తీసుకున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సెపె్టంబరు 5న పార్టీ గుర్తింపు కార్డు కూడా పంపిణీ చేశాం. టీడీపీ నాయకత్వం వానగుట్టపల్లిలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాజేంద్రన్ టీడీపీకి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటోంది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది కేవలం టీడీపీ శ్రేణుల దాడుల వల్ల జరిగిన పరిణామమే. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ నాయకత్వమే వహించాలి’ అని ఎమ్మెల్సీ, వైయస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్, మండల కన్వీనర్ హెచ్ ఎం మురుగేష్ స్పష్టం చేశారు.