ఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?  

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్

రాజ‌మండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌ను రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ ప్ర‌శ్నించారు. నిన్న చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి బహిరంగసభ అట్ట‌ర్‌ప్లాఫ్ అయ్యింద‌ని పేర్కొన్నారు. సోమ‌వారం ఎంపీ భ‌ర‌త్ మీడియాతో మాట్లాడుతూ..నిన్న సభలో చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేదు ? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో మైకులు పనిచేయలేదు.. అంటే.. పరిస్థితులు, దేవుడు వారి పక్షాన లేడని వ్యాఖ్యానించారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది బీజేపీ అని భ‌ర‌త్‌రామ్ దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక అక్రమ కలయికగా మండిపడ్డారు.. గతంలో చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చాలా అనరాని మాటలు అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి రాష్ట్రాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? అని ఎంపీ ప్రశ్నించారు. విలువలు విశ్వసనీయత అనే పదాలు చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేర‌న్నారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదన్నారు. పార్లమెంట్‌లో పాస్ అయిన బిల్లులకు కూడా ఈ రోజుకి అతిగతి లేదన్నారు. విభజన హామీలను ఇంకా అమలు చేయలేదన్నారు. మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా విమర్శించారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లాగా వ్యవహరిస్తున్నారు.. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కి డాన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అని ఆరోపించారు. అధిక వడ్డీలతో పేదవాళ్లు స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిదని దుయ్యబట్టారు.. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. రాజమండ్రిలో గంజాయి బ్లేడు బ్యాచ్‌లు నడుస్తున్నరాయంటే.. దానికి కారణం ఆదిరెడ్డి కుటుంబమే నంటూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. 

Back to Top