దళితులపై దాడుల కోసమేనా అధికారమిచ్చింది?

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఆగ్ర‌హం

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో  ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా : ద‌ళితుల‌పై దాడులు చేసేందుకేనా కూట‌మి ప్ర‌భుత్వానికి అధికారం ఇచ్చింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మండిప‌డ్డారు. పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మందా సాల్మన్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ,  మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, సీఈసీ మెంబర్ మల్లాది విష్ణువర్ధన్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ, పల్నాడులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గుండాల రక్తదాహానికి దళిత యువకుడు సాల్మన్ బలయ్యాడని ఆరోపించారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, పోలీసులు నేరస్తులకు కొమ్ముకాస్తూ బాధితులపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సాల్మన్ హత్యను ముందే అడ్డుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, హత్య జరిగిన తర్వాత కూడా దహన సంస్కారాలు చేయకుండా అడ్డుకోవడం అత్యంత అమానుషమని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన సీఐ భాస్కర్ రావును తక్షణమే సస్పెండ్ చేయాలని, అప్పటివరకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌ బూదాల శ్రీనివాసరావు, శరం శెట్టి పూర్ణచంద్రరావు, వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, ఎస్సీ క‌మిష‌న్ మాజీ స‌భ్యుడు కాలే పుల్లారావు, దాస్ ప్రకాష్ కెనడి, ఉమ్మడి ధనరాజ్, విజయవాడ సెంట్రల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్యామ్, జిల్లా అధికార ప్రతినిధి పొదిలి చంటి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి. సుందర్ పాల్, సీనియర్ నాయకుడు బంధాల కిరణ్ రాజ్, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మస్తాన్, జిల్లా కార్యదర్శి ఎస్. రాజ్ కమల్, ఒగ్గు గవాస్కర్, బోడె ప్రేమ్, పేటేట్ నాని, నక్కా ప్రభుదాస్, చింత బుచ్చిబాబు, మేడేపల్లి ఝాన్సీ, మన్నే చంద్రలీల, వేములపల్లి బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

Back to Top