సంక్రాంతి నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ వాయిదా.. 18 నుంచి అమలు

పండుగకు పల్లెలకు చేరే ప్రజలు ఇబ్బందిపడకూడదని నిర్ణయం

థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

తాడేపల్లి: నైట్‌ కర్ఫ్యూ అమలును రాష్ట్ర ప్రభుత్వ వాయిదా వేసింది. సంక్రాంతి పండుగ అనంతరం రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. సంక్రాంతి పండుగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. 

మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధింపు ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. 

Back to Top