అనంతపురం: రైతన్నలకు తోడుగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన చేపట్టనున్న ‘అన్నదాత పోరు’కు రైతులు తరలిరావాలని వైయస్‌ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అన్నదాత పోరుకు సంబంధించి పోస్టర్లను వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైయస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు వర్ణణాతీం. గత ఏడాది అతివృష్టి, అనావృష్టితో నష్టపోయారు. అనంతపురం జిల్లాలో గత ఖరీఫ్, రబీలో వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ ఏడాది ప్రకృతి కరుణ లేదు.. ప్రభుత్వ సహకారం లేదు. ఫలితంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. విత్తనాల నుంచి సరైన సమయంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి. బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలించారు. రూ.260 అమ్మాల్సిన యూరియా రూ.350 నుంచి రూ.400కు అమ్మే పరిస్థితి కల్పించారు. అనంతపురం జిల్లాలో 8.50 లక్షల ఎకరాలు సాగుభూమి ఉంటే సాగైంది 4.30 లక్షల ఎకరాలు మాత్రమే. గత ఏడాది కంటే ఎక్కువ యూరియా పంపించామని చెబుతున్నా ఇంకా యూరియా కొరత వేధిస్తోంది. యూరియా కోసం ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లే యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా వారిపై చర్యలు శూన్యం. గత ఏడాది నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందజేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలపై రైతులు, ప్రతిపక్షాలు మాట్లాడితే జైళ్లో పెడతామని చెప్పడం దారుణం. రైతు సమస్యలపై వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఈనెల 9న తేదీన అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ర్యాలీలు చేసి ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేస్తాం.` అని అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో.. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీసత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నదాత పోరు పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. పెనుకొండ నియోజకవర్గం రోద్దం మండలం చినమంతూరు పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోస్టర్ రిలీజ్ చేశారు. 9వ తేదీ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టే ఆందోళనకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. కర్నూలులో.. ఈ నెల 9 వ తారీఖున జరిగే " అన్నదాత పోరు` కార్యక్రమం పోస్టర్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. మొదటి నుండి చంద్రబాబు వ్యవసాయ దండగా అని చెబుతున్నారు. యూరియా కొరతతో రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్ చెప్పులు, పాసు పుస్తకాలను క్యూలో ఉంచుతున్నారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. టిడిపి నేతల కమీషనతో 700 పైగా యూరియా బస్తాను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. రాష్ట్రంలో టిడిపి నేతలు రేషన్ బియ్యం, ఇసుక మద్యాన్ని వ్యాపారం గా మార్చుకొని యూరియా ని కూడా కమీషన్ కోసం రైతులను వేధిస్తున్నారు.యూరియా కోసం రైతులు ఘర్షణలు పడుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆర్బికేల ద్వారా యూరియా ని అందించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న యూరియా బస్తా కోసం రైతులు బిక్షగాలుగా మార్చారు. గిట్టుబాటు ధరలు లేక మిర్చి, పత్తి, ఉల్లి రైతులు రాష్ట్రంలో అల్లాడుతున్నారు. దీనిపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే... కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సమస్యలు ప్రశ్నిస్తే తప్ప పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఉల్లి క్వింటా ధర 150 నుండి 200 రూపాయలు పలుకుతోంది. కనీసం కూలీ ఖర్చులకు కూడా ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అప్పుడు ప్రభుత్వం స్పందించి 1,200 రూపాయలు కల్పించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ధర్నాలు ప్రశ్నిస్తే తప్ప రైతులకు ప్రజలకు మేలు చేయడం లేదు. అందుకే రైతాంగ సమస్యలపై ఈనెల 9వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "అన్నదాత పోరు" నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది` అని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు.