జనరంజక బడ్జెట్‌

అసెంబ్లీలో 2023-2024వ ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బ‌డ్జెట్‌ 

మా మేనిఫెస్టో ముఖ్య లక్షణాలు..సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనం

 మేనిఫెస్టోలోని వాగ్ధానాలకు మంచి మా ప్రభుత్వం పని చేస్తోంది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపరంగా దేశంలోనే ఏపీ నంబ‌ర్ వ‌న్‌

రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌

అమ‌రావ‌తి: ప్ర‌జా సంక్షేమమే ధ్యేయంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు. 


మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే..

  • 2023–2024 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను స్పీకర్‌ అనుమతితో గౌరవ సభ ముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. 
  • కొన్ని మాటలు గౌరవ సభ ద్వారా రాష్ట్రానికి తెలియజేస్తున్నాను. 2019లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రెండేళ్ల కోవిడ్‌ను అధికమిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ఆశీస్సులతో బడ్జెట్‌ను 4సార్లు వరుసగా ప్రవేశపెట్టాను. ఈ నాలుగేళ్లు కూడా బడ్జెట్‌ను తయారు చేసేందుకు రాత్రింబవళ్లు పని చేశారు. ఈ నాలుగేళ్లు నాతో కలిసి పని చేసిన ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌లోని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
  • పోతన పద్యాన్ని గుర్తు చేస్తూ..ఈ రోజు బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నానంటే రాష్ట్రం పట్ల, బడుగు, బలహీనవర్గాల పట్ల సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న బాధ్యత, ప్రేమ అనే అంశాల ద్వారా ఈ రోజు వరుసగా ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాను.
  • రవీంద్రనాథ్‌ ఠాగూరు ఇలా రాశారు..
  • నిరంతరం కార్యదీక్షత, విశాల దృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా..ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి చేరేలా ..నాదేశాన్ని జాగృతం చేయండి తండ్రీ అన్న సందేశాన్ని అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలమనే నమ్మకం దృఢపడుతుంది. నాటి భావోద్వేగాలు నేటి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం మానవ నైజం. నా దేశాన్ని జాగృతం చేయండి అన్న చివరి మాటలను ప్రపంచాన్ని జాగృతం చేయండి అన్న మాటలతో భర్తీ చేస్తే సార్వజనీయత గోచరిస్తోంది. ఈ భావన స్ఫూర్తినిచ్చే ఒక అమూల్య సందేశం. ఈ ప్రేరణ అన్ని అసమానతలను అధిగమించగల స్ఫూర్తిని అపూర్వమైన సవాళ్లపై విజయం సాధించగలమనే సంకల్పాన్ని  మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సమష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర  మనకు చెబుతుంది. మన రాష్ట్రం ఇందుకు మహోజ్వల ఉదాహరణగా నిలుస్తోంది. 
  • రాష్ట్ర విభజన తరువాత అన్ని రంగాలను 2019 తరువాత పునఃప్రారంభించాం. విభజన సవాళ్లతో సతమతమవుతూ..కోవిడ్‌ –19 మహమ్మారితో సహసోపేతమైన పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక పక్క ప్రపంచ స్థాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే మన రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య రక్షణ, జీవనానికి రక్షణ వలయాన్ని నిర్మించుకుంటూ..మరోపక్క రాష్ట్ర అభివృద్ధి ప్రస్తానాన్ని కొనసాగించాం. ఈ సంక్షోభ సమయంలో కూడా ఆరోగ్య సంరక్షణ నుంచి సుస్థిర అభివృద్ధి వరకు అన్ని రంగాల్లో సంక్షోభాన్ని అధికమిస్తూ..ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చి యధాతధ స్థితికి తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది.
  • కోవిడ్‌ తదనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యమైన అంశాలు రెండు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సుపరిపాలన. ఈ రెండు పరస్పర సంబంధం, సార్వత్రిక ఆంకాక్షలు. సుస్థిరత జీవితానికి మార్గదర్శకత సూత్రంగా 17 సుస్థిరత అభివృద్ధి లక్ష్యాల సాధనకు బలమైన రాజకీయ నాయకత్వం, మంచి విధానాలు, సమర్ధవంతమైన సంస్థలు, ఫలితాల ఆధారిత పాలనపై ఆధారపడి ఉంటుందని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం. సుస్థిర అభివృద్ధి, జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత, సమాన అవకాశాలతో కూడిన సుపరిపాలనకు దారి తీస్తుంది. స్థిరమైన అభివృద్ధి సాధించడానికి సుపరిపాలన అవసరం. ఈ లక్ష్యాల నిజమైన అమలుకు బలమైన సంస్థలే పునాది రాళ్లు. మా ప్రభుత్వం ఈ సుస్థీర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తోంది. 
  • దూరదృష్టిగల నాయకత్వం, సమర్ధ పరిపాలన, కచ్చితమైన నిర్వాహణలో కూడిన సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కీలకమైనవి. 
  • వైయస్‌ జగన్‌ పాలనలో కష్టాలు రాకుండా ఎల్లవేళలా నిరోధించలేనప్పటికీ ఆ కష్టాలను మంచి మార్గాల ద్వారా ఎదురుకోవచ్చు అన్న భరోసాను మనం చూస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే విజయాన్ని పొందినప్పుడు ఉదారంగా ఉండటం, కష్టాలను ఎదుర్కొనే ప్రతికూల సమయంలో దృఢంగా ఉండటం సీఎం వైయస్‌ జగన్‌ లక్షణాలు. విధాన పరమైన ఆవిష్కరణలు, వినూత్న పాలనా విధానాలు మా ప్రభుత్వం విశిష్ట లక్షణాలు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలు, మేనిఫెస్టోలో పెట్టిన పథకాల ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక సమ్మిళిత విధానాన్ని మా ప్రభుత్వం అవలంభించింది. 
  • మా మేనిఫెస్టో ముఖ్య లక్షణాలు..సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనం.
  •  మా ప్రభుత్వ పాలనలో మొదటి సంవత్సరమే ఈ సూత్రాలన్నింటిని దాదాపుగా అమలు చేసింది. కోవిడ్‌–19 కారణంగా ఈ సూత్రాల అమలులో అవంతరాలు ఏర్పడినా వెనుకంజ వేయకుండా వీటన్నింటిని సంపూర్ణంగా అమలు చేస్తున్నాం.
  • నిజానికి మా మేనిఫెస్టోలోని వాగ్ధానాలకు మంచి మా ప్రభుత్వం పని చేస్తోంది.
  • వినూత్నమైన పాలన విధానాల ఫలితంగా నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో  15004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం. 2.65 లక్షల మంది వాలంటీర్ల నియామకం. 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చాం. 15,715 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 3,707 వైయస్‌ఆర్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 461 పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్మించాం.
  • 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, 4.40 లక్షల ఇళ్ల నిర్మాణాలు 
  • జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించడం. 5.20 లక్షల ఈ–లెర్నింగ్‌ పరికరాలు పంపిణీ.
  • సీబీఎస్‌ఈ అనుబంధంతో ఇంగ్లీష్‌మీడియం విద్య.
  • జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ. 9,249 కోట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • వైయస్‌ఆర్‌ ఆసరా పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రుణాల రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.19,133 కోట్లు జమ చేశాం.
  • వైయస్‌ఆర్‌ చేయూత పథకం కింద రూ.14,129 కోట్ల ఆర్థికసాయం
  • జగనన్న తోడు పథకం కింద రూ.2,470 కోట్ల రుణాల మంజూరు
  • వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక లక్ష 41 వేల కుటుంబాలకు వర్తింపు.
  • వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.971 కోట్ల ఆర్థికసహాయం
  • 56 సామాజిక సంక్షేమ కార్పొరేషన్ల ఏర్పాటు
  • 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
  • 104 అంబులెన్స్‌ల సంఖ్యను పెంచడం. 
  • సంక్షేమ పింఛన్లను నెలకు రూ.2,750 ఇవ్వడం
  • ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలిగాం.
  • ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాల అమలులో సమూల మార్పులను గమనించవచ్చు. 
  • సాంకేతికతను ప్రభుత్వం సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా నేరుగా 21  పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ బ్యాంకు ఖాతాల్లోకి నగదును ప్రభుత్వం జమ చేస్తోంది.
  • ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలు చేసేందుకు మా ప్రభుత్వం రూ.1.97 లక్షల కోట్లు ఇంతవరకు విడుదల చేసింది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఒక అద్భుతమైన నమూనాగా నిలిచింది. ఈ విధానం సంక్షేమ పథకాల అమలులో  ఉన్న లోపాలను పూర్తిగా నివారించి, అర్హులైన అందరికీ ఎటువంటి అవంతరాలు లేకుండా పారదర్శకంగా, ప్రభావవంతమైన పద్ధతిలో సంక్షేమ చర్యలు అందేలా పని చేస్తున్నాం.
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి:
  • 2018–2019 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధికి సంబంధించి స్థిరమైన ధరల్లో మన రాష్ట్రం దేశంలోనే 22వ స్థానంలో ఉంది. మా ప్రభుత్వం అభివృద్ధి విధానాల కారణంగా పెట్టుబడి, వినియోగం ..ఈ రెండింటిని అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధిని పొందింది. ఫలితంగా మన రాష్ట్రం 2021–2022 ఆర్థిక సంవత్సరానికి గాను స్థిరమైన ధరలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపరంగా దేశంలోనే ఒకటోవ స్థానంలోకి వచ్చింది. మనరాష్ట్రంలో వృద్ధిరేటు 11.43 శాతంగా నమోదు అయ్యింది. 
  • కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో మన ప్రభుత్వం అందించిన మద్దతు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సుస్థిరత సాధించడంలో ప్రభావంతంగా పని చేసింది. గత ఐదేళ్లలో అత్యధిక వృద్ధిరేటును నమోదు చేయడానికి వీలు కల్పించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

►రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైతం మా ప్రభుత్వం తన  లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అవకాశాలను ప్రాధాన్యత ఇచ్చి పరిరక్షిస్తోందని ఈ గణాంకాలు చూపుతున్నాయి. 
2022–2023 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.13,17,728 కోట్లు. 
2023–2024 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14,49,501 కోట్లతో అంచనా వేశారు.
నవరత్నాలు, మేనిఫెస్టోలో అన్ని పథకాలు సుస్థిరత, అభివృద్ధి లక్ష్యాల్లో ఏకీభవిస్తున్నాయి.
1. జీవనోపాధి
2. సామర్ధ్య అభివృద్ధి, సాధికారత 
3. సామాజిక భద్రత
4. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి
ఈ నాలుగు అంశాల ద్వారా వివరించబడ్డాయి. ఈ అంశాల ద్వారా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుసంధానం చేస్తూ 2023–2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రతిపాదించారు.
 2023-2024 ఆర్థిక సంవ‌త్స‌రం బడ్జెట్‌ కేటాయింపులు  ఇలా..
►వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434.72 కోట్లు
►వైయ‌స్ఆర్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు
►జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
►జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
►వైయ‌స్ఆర్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
►డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
►రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
►వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
►జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
►వైయ‌స్ఆర్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు
►వైయ‌స్ఆర్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
►వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
►మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు
►రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
►లా నేస్తం-రూ.17 కోట్లు
►జగనన్న తోడు- రూ.35 కోట్లు
►ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
►వైయ‌స్ఆర్‌ కల్యాణమస్తు-రూ.200 కోట్లు
►వైయ‌స్ఆర్‌ ఆసరా-రూ.6700 కోట్లు
►వైయ‌స్ఆర్‌ చేయూత-రూ.5000 కోట్లు
►అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
►మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
►ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
►వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
►మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
►జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
►పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
►పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు
►యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
►షెడ్యూల్‌ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
►షెడ్యూల్‌ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
►వెనుకబడిన తరగతుల సంక్షేమం​- రూ. 38,605 కోట్లు
►కాపు సంక్షేమం​- రూ.4,887 కోట్లు
►మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
►పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
►పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
►రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
►నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు
►పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
►ఎనర్జీ- రూ.6,456 కోట్లు
►గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
►గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
♦ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన
♦సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల
♦దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్‌ కార్డుల జారీ
♦ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం
♦రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు
♦ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రాలు
♦విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు
♦మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు
♦సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు
♦వైయ‌స్ఆర్‌ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు
♦17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు.
♦లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది

♦వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయింపు: మంత్రి బుగ్గన
♦వైయ‌స్ఆర్‌చేయూత కింద రూ.5వేల కోట్లు కేటాయింపు
♦విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం
♦టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నాం
♦నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి
♦స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది
♦ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి 11.43 శాతం
♦సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయి
♦రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు
♦రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది
♦పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీ
♦16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నాం
♦గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించాం
♦వైఎస్సార్‌ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వాం
♦కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీరు
♦మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచే మోడల్‌ పట్టణాలుగా మంగళగిరి, తాడేపల్లి
♦విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
♦175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు
♦ఐటీఐలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి
♦చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు
♦పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్లతో ఒప్పందాలు
♦విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ స్మృతివనం
♦125 అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన

 

Back to Top