పథకం ప్రకారమే వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం

విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని తేలిపోయింది. ఇదే విషయాన్ని పోలీసు కమిషనర్‌ లడ్డా ధ్రువీకరించారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై గతేడాది అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం విధితమే. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీకి చెందిన హర్షవర్దన్‌ అనే వ్యక్తి క్యాంటిన్‌లో పని చేస్తున్నాడు. అలాగే అతను వెల్డర్, కేక్‌ మాస్టర్, కుక్‌గా పని చేశాడని సీపీ తెలిపారు. 2017లో వైయస్‌ జగన్‌ ఫ్లెక్సీని తయారు చేయించారని లడ్డా చెప్పారు.

అక్టోబర్‌ 18వ తేదీనే వైయస్‌ జగన్‌ హత్యకు ప్లాన్‌ చేశారని, అక్టోబర్‌ 17వ తేనీ వైయస్‌ జగన్‌ విశాఖ నుంచి వెళ్లిపోవడంతో సాధ్యపడలేదన్నారు. రెండు సార్లు కోడి పందాల కత్తికి శ్రీనివాస్‌ పదును పెట్టాడని సీపీ తెలిపారు. ముందుగానే ఓ లేఖను విజయదుర్గతో రాయించాడని, ఆ లేఖను విజయదుర్గ జిరాక్స్‌ కూడా చేయించి పెట్టిందన్నారు. విజయదుర్గతో 164 సెక్షన్‌ కింద స్టేట్‌మెంట్లు రికార్డులు చేశామని చెప్పారు. 
 

Back to Top