వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లోనే బీసీల‌కు న్యాయం

ఆర్థికంగా, రాజ‌కీయంగా బీసీల‌కు ప్రోత్సాహం

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 56 కులాల‌కు కార్పొరేష‌న్లు 

పూలే స్ఫూర్తితోనే అండ‌గా నిలిచిన వైయ‌స్ జ‌గ‌న్ అభినవ పూలే 

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు

విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద మ‌హాత్మా జ్యోతిరావు పూలే విగ్ర‌హానికి ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల నివాళి అనంత‌రం తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలోనూ పూలే జ‌యంతి వేడుక‌లు.  

వైయ‌స్ఆర్‌సీపీ  హ‌యాంలోనే మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు

33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు ఇప్పుడు చ‌ట్టం చేస్తున్నారు

కోర్టుకెళ్లి బీసీల రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకున్న నీచుడు చంద్ర‌బాబు 

అయినా 67 శాతం స్థానాల్లో బీసీల‌కు ప‌ద‌వులిచ్చిన ఘ‌న‌త జ‌గ‌న్‌దే

అందుకే జ‌గ‌న్ మ‌ళ్లీ రావాల‌ని బీసీలు కోరుకుంటున్నారు

తాడేప‌ల్లిలో జ‌రిగిన పూలే జ‌యంతి వేడుక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు    

విజ‌య‌వాడ‌, తాడేప‌ల్లి: బీసీల‌కు ఆర్థికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా అండగా నిలిచిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని వైయ‌స్ఆర్‌ పార్టీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. బీసీల‌ను బ్యాక్ వ‌ర్డ్ క్యాస్ట్ గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్‌గా చూసి త‌న ఐదేళ్ల పాల‌న‌లో సామాజిక న్యాయం చేసి చూపించార‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ని కొనియాడారు. త‌న మంత్రి వ‌ర్గంలో ఏకంగా 11 మంది బీసీల‌కు మంత్రులుగా అవ‌కాశం క‌ల్పించారని, 25 మంది మంత్రుల్లో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల వారేన‌ని చెప్పారు. చంద్ర‌బాబు కోర్టుకెళ్లి బీసీల‌కు రిజ‌ర్వేషన్లు 27 శాతానికి ప‌రిమితం చేసినా, వైయ‌స్ జ‌గ‌న్ గారు మాత్రం 67 శాతం ప‌దవులు బీసీల‌కు కేటాయించి బీసీల‌ను రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మ‌హిళ‌ల‌ను మేయ‌ర్లు, జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్లుగా నియమించి రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌ని, డీబీటీ ద్వారా వివిధ ప‌థ‌కాల రూపంలో న‌గ‌దు జ‌మ చేసి ఆర్థికంగా అండ‌గా నిలిచిన జ‌గ‌న్ అభిన‌వ పూలే అని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌ లోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద ఉన్న మ‌హాత్మా జ్యోతిరావు పూలే విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రులు జోగి ర‌మేశ్‌, వెలంప‌ల్లి శ్రీనివాస్‌, ఎన్టీఆర్ జిల్లా బ‌ అధ్య‌క్షుడు దేవినేని అవినాశ్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, పార్టీ అధికార ప్ర‌తినిధి ఆసిఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంత‌రం వారంతా తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన మ‌హాత్మా జ్యోతిరావు పూలే జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. నాయ‌కులు పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుక‌ల్లో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ర‌మేశ్ యాద‌వ్‌, క‌ల్ప‌ల‌తా రెడ్డి, క‌వురు శ్రీనివాస్‌, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వైయ‌స్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బీవై రామ‌య్య‌, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ మూర్తి, ఎస్సి సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు పుల్లారావు, తోలేటి శ్రీకాంత్, బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ షేక్ ద‌స్త‌గిరి, వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయ‌కులు పాల్గొన్నారు.   

జ‌గ‌న్ పాల‌న‌లో బీసీల‌కు సామాజిక న్యాయం
- జోగి ర‌మేశ్‌, మాజీ మంత్రి 

బీసీల‌కు సామాజిక న్యాయం కోసం పోరాడిన ఉద్య‌మ‌కాఉడు మ‌హాత్మా జ్యోతిరావుపూలే. మ‌హిళ‌ల‌కు ఉచిత విద్య అందించి ఉన్న‌తంగా తీర్చిదిద్దారు. ఆయ‌న స్ఫూర్తితో బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ గారు ఆర్ధికంగా, సామాజికంగా, రాజ‌కీయంగా ఎన్నో అవ‌కాశాలు క‌ల్పించి ముందుకు న‌డిపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక బీసీల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. సామాజిక న్యాయం కోసం పాటుప‌డేవాడే అయితే బీసీల‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఎందుకివ్వ‌లేదు?  మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోక‌పోతే భ‌విష్య‌త్తులో గ‌ట్టిగా బుద్ధి చెబుతాం.  

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రంలో చ‌దువుల విప్ల‌వం 
- వెలంప‌ల్లి శ్రీనివాస్‌, మాజీ మంత్రి

చ‌దువుల‌తోనే దేశ పురోగ‌తి సాధ్య‌మ‌ని న‌మ్మిన గొప్ప వ్య‌క్తి మ‌హాత్మా జ్యోతిరావు పూలే. మ‌హిళ‌లు చ‌దువుకుంటే కుటుంబాల్లో వెలుగులు నింప‌వ‌చ్చ‌ని భావించి త‌న భార్య‌తోనే మ‌హిళ‌ల చ‌దువుల‌కు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి మ‌హిళా టీచ‌ర్‌గా ఆయ‌న శ్రీమ‌తి సావిత్రీబాయి పూలేని తీర్చిదిద్దారు. ఆయ‌న స్ఫూర్తితోనే వైయ‌స్ జ‌గ‌న్ గారు త‌న పాల‌న‌లో రాష్ట్రంలో చ‌దువుల విప్ల‌వం తీసుకొచ్చారు.

పూలే స్ఫూర్తితో జ‌గ‌న్ పాల‌న 
- దేవినేని అవినాశ్‌, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు

 
మ‌హాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో వైయ‌స్ జ‌గ‌న్ గారు గ‌డిచిన ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం ఎంతగానో కృషి చేశారు. విద్యారంగంలో ఎన్నో వినూత్న మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. పూలే ఆశ‌యాల సాధ‌న కోసం అంద‌రూ కృషి చేయాలి. నాడు-నేడు ద్వారా ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను కార్పొరేట్‌కి దీటుగా తీర్చిదిద్దారు. 

డీబీటీ ద్వారా బీసీల‌కు రూ.1.70 ల‌క్ష‌ల కోట్ల లబ్ధి
- మ‌ల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే 

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోసం పోరాడిన నాయ‌కుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే. ఆయ‌న స్ఫూర్తితోనే వైయ‌స్ జ‌గ‌న్ గారు త‌న పాల‌న‌లో బీసీల‌కు పెద్ద పీట వేశారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో 8 మంది బీసీలుంటే, వైయ‌స్ జ‌గ‌న్ గారు 11 మంది బీసీల‌ను మంత్రులు చేశారు. న‌లుగురు బీసీల‌కు రాజ్య‌స‌భ ఇచ్చిన చ‌రిత్ర కూడా వైయ‌స్ఆర్‌సీపీకే ద‌క్కుతుంది. డీబీటీ ద్వారా  రూ. 1.70 ల‌క్ష‌ల కోట్లు బీసీల ఖాతాల్లో జ‌మ చేసి ఆర్థికంగా అండ‌గా నిలిచారు. వైయ‌స్సార్సీప హ‌యాంలో కార్పొరేష‌న్ చైర్మ‌న్లుగా, మేయ‌ర్లుగా బీసీల‌కు స‌ముచిత స్థానం ద‌క్కింది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక బీసీల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది. 

మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌దే
- రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, మాజీ మేయ‌ర్‌

మ‌హిళ‌లు రాజకీయాల్లో స్వ‌తంత్రంగా బ‌య‌ట‌కొచ్చి పోరాడుతున్నారంటే దానికి కార‌ణం మ‌హాత్మా జ్యోతిరావుపూలే గారి పోరాటాలే కార‌ణం. ఆయ‌న ఆశ‌యాల స్ఫూర్తితో మ‌హిళ‌ల‌కు ప‌దవుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి ప్రోత్సహించారు. 11 మంది బీసీల‌ను మంత్రులుగా చేశారు. జెడ్పీ చైర్ ప‌ర్స‌న్లు, మేయ‌ర్లు ఎంద‌రో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. నాలుగుసార్లు ముఖ్య‌మంత్రిని అని చెప్పుకునే చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం క‌ల్పించ‌డం లేదు. 

- షేక్ ఆసిఫ్‌, వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి

బీసీలంటే బ్యాక్ వ‌ర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్ప‌డ‌మే కాకుండా అధికారంలోకి వ‌చ్చాక ఐదేళ్ల‌లో బీసీల‌ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ప‌థ‌కాల రూపంలో బీస‌ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచారు. పార్టీ ప‌దవులు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీల‌కు ప్రాధాన్యం క‌ల్పించారు. 

జ‌గ‌న్‌ని సీఎంని చేసుకోవ‌డానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు
- ర‌మేశ్ యాద‌వ్‌, ఎమ్మెల్సీ

మ‌హాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల‌ను ముందుకు తీసుకెళ్లిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్ గారికే ద‌క్కుతుంది. 25 మంది మంత్రుల్లో  17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన వారే ఉన్నారు. 135 కులాల‌ను ద‌గ్గ‌ర‌కు తీసి 56 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి ప్రాధాన్య‌త క‌ల్పించారు. 800 మందికి పైగా డైరెక్ట‌ర్లుగా అవ‌కాశం క‌ల్పించారు. ఎప్పుడు ఎన్నిక‌లొచ్చినా వైయ‌స్ జ‌గ‌న్ గారిని ముఖ్య‌మంత్రిని చేసుకోవ‌డానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. 

పూలే స్ఫూర్తితోనే జ‌గ‌న్ పాల‌న 
- క‌ల్ప‌ల‌తారెడ్డి, ఎమ్మెల్సీ

విద్య ద్వారా మ‌హిళ‌ల‌కు స‌మాజంలో ఉన్న‌త స్థానం కల్పించిన మ‌హ‌నీయులు మ‌హాత్మా జ్యోతిరావు పూలే. ఆయ‌న స్ఫూర్తితోనే వైయ‌స్ జ‌గ‌న్ గారు ముఖ్య‌మంత్రిగా పార్టీల‌కు అతీతంగా మ‌హిళ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించి ఆర్ధికంగా అండ‌గా నిలిచారు. 

వైయ‌స్ జ‌గ‌న్ తోనే బీసీల‌కు న్యాయం 
- క‌వురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ

కుల వ్య‌వ‌స్థ, అంట‌రానిత‌నంపై పోరాటం చేసిన ధీరుడు మ‌హాత్మా జ్యోతిరావు పూలే. అణ‌గారిన వర్గాల అభ్యున్న‌తి కోసం శ్ర‌మించిన శ్రామికుడాయ‌న‌. బాలిక‌లు చ‌దువుకోవ‌డానికి వీల్లేద‌ని పెట్టిన క‌ట్టుబాట్ల‌ను కూడా కాద‌ని త‌న భార్య‌తో మ‌హిళ‌ల చ‌దువుల‌కు శ్రీకారం చుట్టిన గొప్ప నాయ‌కుడు పూలే. ఆయ‌న ఆశ‌యాల‌ను త‌న పాల‌న ద్వారా ముందుకు తీసుకెళ్లిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. త‌న ఐదేళ్ల పాల‌న‌లో చ‌దువుల విప్ల‌వం తీసుకొచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే వైయ‌స్ జ‌గ‌న్ గారికి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకోవాలి. 

చంద్ర‌బాబు బీసీల రిజ‌ర్వేష‌న్లను అడ్డుకున్నాడు  
- బీవై రామ‌య్య‌, మాజీ మేయర్‌

కుల వివ‌క్ష‌త‌పై పోరాటం చేసిన గొప్ప నాయ‌కులు పూలే. ఆయ‌న స్ఫూర్తితోనే వైయస్ జ‌గన్ గారు బీసీలు, మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించాల‌ని ఇప్పుడు దేశంలో చ‌ట్టం చేస్తున్నారు. కానీ దేశంలోనే మొద‌టిసారి మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్ గారికే ద‌క్కుతుంది. బీసీ రిజ‌ర్వేష‌న్లు 27 శాతం మించ‌కుండా తెలుగుదేశం పార్టీ కోర్టుకెళ్లి అడ్డుకుంటే వైయ‌స్ జ‌గ‌న్ గారు 67 శాతం సీట్ల‌లో బీసీల‌కు అవ‌కాశం క‌ల్పించి ప్రోత్స‌హించారు. 

Back to Top