కృష్ణా జిల్లా: గత 40 ఏళ్లలో చంద్రబాబు ఏనాడూ తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని మాజీమంత్రి పేర్నినాని విమర్శించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నాడని మండిపడ్డారు. తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడినని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం చెప్పుకుంటారని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైయస్ జగన్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి , తండ్రి చనిపోతే తలకొరివి పెట్టలేని వాడు.. నేటికీ రామారావు అల్లుడినని చెప్పుకుంటాడని చంద్రబాబుపై మండిపడ్డారు పేర్ని నాని. నేను ఫలానా వాడి కొడుకుని అని చెప్పుకోలేని వాడు కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. రాజకీయాల్లో చంద్రబాబు ఉండటం అనవసరమని అన్నారు. పొలాల్లో తాడిచెట్టుకు, మర్రిచెట్టుకు కూడా వయసొస్తుందన్న ఆయన.. 80 ఏళ్ల వయసులో రాజకీయాల కోసం ఉక్రోషంతో దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా వైయస్ఆర్‌సీపీ జెండాను కూడా టచ్ చేయలేడని పేర్నినాని అన్నారు. చంద్రబాబు బతుకంతా ప్రజలకు తెలుసని, అధికారంలో రావడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని.. అధికారంలోకి వచ్చాక ఎలా నేల నాకిస్తాడో అందరికీ తెలుసని తెలిపారు.. 80 ఏళ్ల ముసలినక్క చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందని పేర్ని నాని హితవు పలికారు.