బొబ్బిలి పట్టణంలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వత పరిష్కారం

సమగ్ర తాగునీటి అభివృద్ధి పథకం నిర్మాణానికి మంత్రి బొత్స శంకుస్థాపన
 

విజ‌య‌న‌గ‌రం:  బొబ్బ‌లి ప‌ట్ట‌ణంలో తాగునీటి స‌మ‌స్య‌కు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ శాశ్వ‌త ప‌రిష్కారం చూపారు. శ‌నివారం  బొబ్బిలి పట్టణంలో సమగ్ర తాగునీటి అభివృద్ధి పథకం నిర్మాణానికి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ శంకుస్థాపన చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు రెండు క‌ళ్లుగా భావించామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు. కార్య‌క్ర‌మంలో  జిల్లా పరిషత్ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) , పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ,శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ,జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి,  బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ రావు, వైస్ చైర్మన్లు గోలగాన రమాదేవి, చెలికాని మురళీకృష్ణ,జడ్పిటిసి శాంతి కుమారి, కౌన్సిలర్లు,బొబ్బిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top