మూడు రాజ‌ధానులు ముద్దు

రాష్ట్ర‌వ్యాప్తంగా భారీ ర్యాలీలు
 

అనంతపురం : ఒక్క రాజ‌ధాని వ‌ద్దు..మూడు రాజ‌ధానులు ముద్దంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. మూడు రాజధానులు, పరిపాలన- అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల్లో అభివృద్ధి సమానంగా జరగాలంటూ నిన‌దించారు.  హిందూపురంలో నిర్వ‌హించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్  మాట్లాడుతూ.. రాయలసీమలో పుట్టి సీమ అభివృద్ధికి ఏమాత్రం ఇష్టం చూపని చంద్రబాబు రాయలసీమ ద్రోహీ అని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లలో రాయలసీమలో కుప్పంతో సహా ఏ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. అమరావతి విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి కేసులు పెడతారేమోనని భయపడి ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో రాజధాని పేరుతో రూ.5600 కోట్లు పెట్టి  లీకు బిల్డింగులు కట్టాడని,  కానీ అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 6వేల కోట్లతో వైఎస్‌ జగన్‌ ప్రజలకు మరింత చేరువయ్యారని తెలిపారు.  

తాజా వీడియోలు

Back to Top