కాకినాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చి వేసిన సంగతి తెలిసిందే.. ఆ మార్పుల్ని చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయంటూ పొగిడారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ బాలుర హైస్కూల్‌ను పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా గత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తరగతి గదుల్లో మార్పు చూసి ఇది ప్రభుత్వ పాఠశాలా? లేక ప్రైవేటు పాఠశాల అంటూ పక్కనే ఉన్న అధికారుల్ని అడిగారు. ఆ తర్వాత విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్‌ని చూసి చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత అదే స్కూల్‌లో పదవ తరగతి గదిలో విద్యార్ధులు కూర్చునే బెంచీలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో కరచాలనం చేస్తూ ఈ బెంచ్‌లు ఎప్పుడు వచ్చాయని అడగారు. అందుకు పవన్ పక్కనే ఉన్న కలెక్టర్ షాన్ మోహన్ ఇవి నాడు-నేడు పథకం ద్వారా పథకం కింద వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవి అంటూ బదులిచ్చారు. 2014-2019 చంద్రబాబు హయాంలో ఈ సందర్భంగా 2014-2019 గత చంద్రబాబు హయాంలో నాడు పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని దుంబ్రిగుడ గ్రామానికి చెందిన కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను చూసి విచారం వ్యక్తం చేశారు. కూర్చోవడానికి బెంచీలు లేక.. నేల మీద కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థుల్ని పరామర్శించారు. ఆ వీడియోల్ని నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితిని, వైయస్ జగన్ హయాంలోని మారిన ప్రభుత్వ రూపురేఖలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.