తమిళనాడు: చెన్నైలో వైయస్ఆర్‌సీపీ సేవాదళ్ ఆధ్వర్యంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెరంబూర్ ప్రాంతంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలకు చీరలు, తువ్వాళ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సార్థకం చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెన్నైలోని వైయస్ఆర్‌సీపీ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.