న్యూఢిల్లీ : వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ ఎంపీలు న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు.సంవిధాన్ సదన్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంపీలు పునరుద్ఘాటించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలతో కలిసి నిలబడి రాష్ట్ర హక్కుల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబూరావు, డాక్టర్ తనుజారాణి, తదితరులు పాల్గొన్నారు.