గిరిజ‌నుల‌కు దుప్ప‌ట్లు పంపిణీ చేసిన పేరాడ తిల‌క్‌

శ్రీ‌కాకుళం: రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌, టెక్క‌లి పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ పేరాడ తిలక్ ఆధ్వ‌ర్యంలో గిరిజ‌నుల‌కు దుప్ప‌ట్లు పంపిణీ చేశారు.  నందిగాం మండలం రథజన బొడ్డపాడు పంచాయితీలో 500ల గిరిజన కుటుంబాలకు పేరాడ తిల‌క్‌ దుప్పట్లు పంపిణీ చేశారు.  రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేస్తున్న పేరాడ తిలక్‌ సేవలను అధిష్టానం గుర్తించింది. బీసీ వర్గాలకు చెందిన తిలక్‌ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. యువకుడు, పట్టభద్రుడైన పేరాడ తిలక్‌ను పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా పార్టీ అదిష్టానం నియమించింది. గత ఎన్నికల్లో ఆయన టెక్కలి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ తర్వాత కార్పొరేషన్‌ పదవిని అధిష్టానం అందించింది. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా నియమించింది. ఇప్పుడు ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్సీ దువ్వాడకు టెక్కలి బాధ్యతలు

గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్‌కు అధిష్టానం అండగా నిలిచింది. పార్టీ అధి కారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవిని కేటాయించిన అధిష్టానం ఇప్పుడు టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌కు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. పార్టీకి తొలి నుంచి సేవలందిస్తూ విధేయతను కూడా చాటుకున్నారు. ఈ రెండు అంశాలు ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యతను తెచ్చి పెట్టాయి.

పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న నేతలకు గుర్తింపు
 వెనుకబడిన వర్గాలకు వైయ‌స్ఆర్‌ సీపీ మరోసారి రాజకీయ ప్రాధాన్యత కల్పించింది. విధేయతను గుర్తిస్తూ.. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న నేతలను గౌరవించింది. రానున్న ఎన్నికల దృష్ట్యా పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలను నియమించింది. పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ను ని యమించగా, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ప్రస్తుత జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయను, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను నియమించింది. ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయను, అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించడంతో ఆమె స్థానంలో ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా పనిచేస్తున్న ఉప్పాడ నారాయణమ్మను నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Back to Top