ఓటమి భయంతోనే చంద్రబాబులో అసహనం

అభద్రత భావంతోనే చంద్రబాబు రగడ 

టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారు

ఈసీని చంద్రబాబు అగౌరవపరుస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీకే ప్రజల పట్టం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

హైదరాబాద్‌: ఓటమి భయం,అభద్రత భావంతోనే ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు రగడ చేస్తున్నారని  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న రగడకు  ప్రధాన కారణం ఒకటే కనిపిస్తోందన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు,అవకతవకలపై ప్రజలు తీర్పు చెప్పారన్నారు.  చంద్రబాబు ప్రభుత్వానికి స్వస్థి చెప్పి ప్రత్యామ్నాయంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని ప్రజలు ఓట్లు వేశారన్నారు.

చంద్రబాబును ఏపీ భరించే పరిస్థితిల్లో లేదని, మార్పు కావాలని  ప్రజలు వైయస్‌ఆర్‌సీపీ వైపు నిర్ణయం తీసుకున్నారనే సమాచారంతోనే చంద్రబాబులో అసహనం పెరిగిందన్నారు.  జాతీయ సర్వేలు నుంచి చంద్రబాబు సొంత సర్వేలు దాకా  తెలుగుదేశం పార్టీ ఓటమిపాలు అవుతుందని,ౖ వెయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రాబోతుందని తెలిసిన తర్వాత చంద్రబాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు.. జాతీయ స్థాయిలో లబ్ధి పొందాలని, నాయకత్వం వహించాలని,మిగతా రాష్ట్రాల నాయకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఎన్నికల నేపథ్యంలో  ఎటువంటి సమీక్షలు జరపకూడదని కోడ్‌ చెబుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ప్రజల రక్షణ కోసం ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి తీసుకుని సమీక్ష జరపవచ్చని పొందు పరిచివుందన్నారు.ముఖ్యమంత్రి పదవిలో అధికారికంగా ఏమిచేయడానికి వీలులేదని స్పష్టంగా ఉందన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ను చంద్రబాబు అగౌరవపర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాకు తెలియకుండా సీఎస్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తప్పుబట్టారు. ఎలక్షన్‌ కమిషన్‌కు జవాబుదారీగా సీఎస్‌ ఉంటారన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top