ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌తో భేటీ 

 
తాడేప‌ల్లి: విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ ప్రకటించింది. శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్‌టీపీసీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్‌ రంగంలో పెట్టుబడుల అవకాశాలపై సీఎంతో చర్చించినట్లు ఎన్‌టీపీసీ ట్వీట్‌ చేసింది.

పునరుత్పాదక ఇంధనం, పంప్డ్‌ స్టోరేజ్, ఇంధన సామర్థ్యం పెంపు వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాలపై సీఎం జగన్‌తో చర్చించినట్లు ఎన్‌టీపీసీ పేర్కొంది. రాష్ట్రానికి నమ్మకంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఎన్‌టీపీసీని సీఎం అభినందించారని తెలిపింది. కాగా, గురుదీప్‌ సింగ్‌ను సీఎం సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top