విశాఖపట్నం : విశాఖ డేటా సెంటర్ ద్వారా ఏఐ విప్లవానికి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం నాంది పలికిందని, వైయస్ జగన్ కృషి చేసిన కృషిని దాచిపెట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికకు గౌతం అదానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో వాస్తవాలు వెల్లడి కావడంతో చంద్రబాబు క్రెడిట్ చౌర్యం బట్టబయలు అయ్యిందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో అక్టోబర్ 23న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని పోస్టు చేశారు. గౌతం అదానీ ఏమన్నారంటే.. విశాఖపట్నం డేటా సెంటర్‌ను అదానీ గ్రూప్ నిర్మిస్తుందని, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs), గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPUs) ఏర్పాటు గూగుల్ ద్వారా జరుగుతుందని. అలాగే, ఆ ప్రాజెక్టుకు కావలసిన సాంకేతిక మద్దతును గూగుల్ అందిస్తుంది. ఏఐ టెక్నాలజీ విప్లవానికి అవసరమైన సబ్ సీ కేబుల్ ద్వారా ఆసియా–ఆఫ్రికా అనుసంధానం జరగబోతోందని, దీనికి విశాఖ డేటా సెంటర్‌తోనే పునాది పడింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్ తీసుకురావడంలో విశేష కృషి చేసింది. అయితే, ఇంత జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ “అదానీ” పేరును ఒప్పందాల సమయంలోనూ, ప్రస్తుతం కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం ఆయన క్రెడిట్ చోరీ స్వభావాన్ని మళ్లీ బట్టబయలు చేస్తుందని గుడివాడ అమర్నాథ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.