దండయాత్ర చేస్తే.. ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరు

  ఉత్తరాంధ్ర మంత్రులు ఫైర్

  బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి
 

ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి

 బూడి ముత్యాలనాయుడు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి

   పి. రాజన్న దొర, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి

  గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

 సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ మంత్రి

  విశాఖకు రాజధాని వద్దు.. అని చేస్తున్న బాబు దండయాత్ర

  అల్లూరి సీతారామరాజు, మరెందరో గొప్ప వీరులకు, పోరాటాలకు జన్మనిచ్చిన గడ్డ ఉత్తరాంధ్ర

  ఇది ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న యాత్ర. 

  ప్రజలు తిరగబడితే.. రేపు జరగబోయే పరిణామాలకు బాబుదే బాధ్యత. 

 అమరావతితోపాటు విశాఖను రాజధాని చేయాలని మేం కోరుతున్నాం

 విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్నదే మా విధానం

  ఆ వేదికపై ఉన్న రాజకీయపార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాయా..? 

 బాబుకు అమరావతిపై ప్రేమా.. లేక.. రియల్ ఎస్టేట్ పై మమకారమా..? 

  పేదవాడిని చంపి.. ధనికులకు దోచి పెట్టాలన్నదే బాబు దురాలోచన

 విశాఖ ఎయిర్ పోర్టు నుంచే మిమ్మల్ని ప్రజలు వెళ్ళగొట్టింది మరచిపోయావా బాబూ..? 

  బాబు జీవితంలో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు హెరిటేజ్ ఒక్కటే.

 వైయ‌స్‌ జగన్ గారి పాలనలో రూ. 1.65 లక్షల కోట్లు డీబీటీ.. బాబు హయాంలో రూ.3లక్షల కోట్లు డీపీటీః మంత్రి అప్పలరాజు

 హైదరాబాద్ అభివృద్ధికి బాబే శిల్పి అయితే.. మీ పార్టీకి ఒక్క సీటు అయినా ఉందా..?

 హైదరాబాద్ లో బాబుకు మిగిలింది ఎన్టీఆర్ ట్రస్టుభవన్, దాని వాచ్ మెన్ మాత్రమే

 అందరికీ ఆమోదయోగ్యమైన 3 రాజధానుల బిల్లుతో మళ్ళీ వస్తాం..

 దీనిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు

 ఓట్లు, సీట్లు లేని పవన్ కల్యాణ్ మాటలకు విలువ లేదు

విశాఖ‌: ఉత్తరాంధ్రపై అమ‌రావ‌తి రైతులు దండయాత్ర చేసేందుకే పాద‌యాత్ర చేస్తున్నార‌ని,  ఇక్కడి ప్రజలు, ఈ ప్రాంత ఆత్మాభిమానంపై దాడి చేయ‌డ‌మేన‌ని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మంత్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా ప్రజలు తిరగబడితే.. అందుకు బాధ్యుడు చంద్ర‌బాబే అని ఉత్తరాంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు , బూడి ముత్యాలనాయుడు,  పి. రాజన్న దొర, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు హెచ్చ‌రించారు. వివిధ ప్రాంతాల నుంచి మంత్రులు మీడియాతో మాట్లాడారు.

ఉత్తరాంధ్రలోని ఆయా జిల్లాల నుంచి మంత్రులు మాట్లాడుతూ.. ఏమన్నారంటే...

ఉత్తరాంధ్ర నాయకులు సమర్థిస్తారా..? వ్యతిరేకిస్తారా..?
         అమరావతి రాజధానికి సంబంధించి చంద్రబాబు అండ్ కో.. కు  ఎందుకంత తాపత్రయం, ఆరాటం అంటే... ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం పేరుతో ఆయన చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అమరావతిపై బాబుకు ప్రేమ లేదు. అక్కడ ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే మమకారం.  నిన్న ఓ పుస్తకం ఆవిష్కరణ అంటూ చేసిన హడావుడి, మీడియాలో కవరేజి చూస్తే.. అదంతా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని నోటికి వచ్చిన పదజాలంతో దూషించేందుకే పెట్టారనిపిస్తుంది. ఆ వేదికపై ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల్ని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ గా చేయాలన్నది వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం అయితే.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకంగా ఆ వేదికపై నుంచి ఆయా రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడిన మాటలను ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మేం భావిస్తున్నాం. ఆ వ్యాఖ్యలను మీరు కూడా  సమర్థిస్తారా..  వ్యతిరేకిస్తారా.. అన్నది ఆ ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంటే, ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు గుర్తింపు తీసుకువస్తున్న తరుణంలో, మన ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడుతున్న వారిని మీరు ఊరుకుంటారా..? అని అడుగుతున్నాం.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా, సమ భావంతో చూడాల్సిన  రాజకీయ పార్టీలు కొన్ని, సిగ్గు,శరం వదిలేసి, ఒక ప్రాంతానికే, అమరావతికే లబ్ధి జరగాలనే విధంగా మాట్లాడటం భావ్యం కాదు.  అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి, కొందరికి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాకూడదు. రాష్ట్ర సంపద అందరిదీ. 

- ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకత్వాలను, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు అమరావతి రాజధాని  పరిధిలోని ఆ 29 గ్రామాలు తప్పితే.. రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలు, ఆ జిల్లాల్లో ఉన్న వెనుకబడిన, మారు మూల  గ్రామాలు అవసరం లేదా, వాటి అభివృద్ధి పట్టదా..? అని ప్రశ్నిస్తున్నాం. 

ఉత్తరాంధ్రపై బాబు దండయాత్ర
        అమరావతి రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈనెల 12న మహా పాదయాత్ర చేస్తామని చెబుతున్నారు. 
- ఇది తమ ప్రాంతానికి రాజధాని కావాలని చేస్తున్న యాత్ర కాదు. 
- ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అని చేస్తున్నయాత్ర.  
- ఇది ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న యాత్ర. 
- ఇది ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు చేస్తున్న దండయాత్ర. 
- ఇది విశాఖపట్నానికి ఏమీ వద్దు అని చేస్తున్న యాత్ర. 
- ఇది ప్రజలను రెచ్చగొట్టే యాత్ర. 
- ఇలాంటి యాత్రను ప్రజలు అడ్డుకుని  తీరతారు..
- ప్రజలు తిరగబడితే.. ఆ పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యత. 
- ఇది అమరావతిలో 29 గ్రామాలకు తప్ప, రాజధానికి, రాష్ట్రానికి ఎలాంటి  సంబంధం లేదు.. అని చేస్తున్నయాత్ర.

- అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు. అయితే అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండటానికి మేము వ్యతిరేకం. అమరావతితోపాటు రాయలసీమలోని కర్నూలు న్యాయ రాజధానిగా, ఉత్తరాంధ్రలోని విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది మా పార్టీ, మా ప్రభుత్వం విధానం.  పాదయాత్రల ద్వారా మీ ప్రాంతానికి చెందిన ప్రజలను ప్రేరేపించి,  రెచ్చగొట్టి, మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవాలంటే.. దీనికి మా ప్రాంత ప్రజలు సహించరు, అంగీకరించరు. 

- అమరావతి వద్దని మేమేమీ చెప్పలేదే. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉంటుందని స్పష్టంగా చెబుతున్నాం. రాష్ట్రంలోని  మూడు ప్రాంతాల్లో మంచి జరగాలి, మూడు  ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి, మూడు ప్రాంతాలకూ గుర్తింపును తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి ఆలోచన. ఇందుకు అనుగుణంగా, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌, అమరావతిలో లెజిస్లేచర్‌ క్యాపిటల్‌, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలన్నది మా ప్రభుత్వం తాలుకా విధానం. దీనికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే తీరుతాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే బాబుకు వచ్చే నష్టం ఏంటి?
        రాష్ట్ర విభజనకు ముందు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే... వాస్తవానికి తెలంగాణ ప్రాంతం కన్నా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరింత వెనుకబాటుతనంగా ఉన్నాయని, వాటికి మేలు జరగాలని ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఒకసారి గుర్తు చేసుకోవాలి.  అటువంటి ఉత్తరాంధ్రా, రాయలసీమకు గుర్తింపు తెచ్చి మేలు జరగాలనే ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే ... దానికి చంద్రబాబు అండ్ కో.. అడ్డుపడుతుంది. వెనుకబడిన ప్రాంతాలకు మంచి చేసేందుకు ఒక అడుగు పడితే.. దానిని చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు. విశాఖపట్నం కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తే చంద్రబాబుకు, టీడీపీకి నష్టం ఏంటి..?. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖకు అన్ని అర్హతలు, అనుకూలత ఉందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

- పాదయాత్రల పేరుతో, ఉత్తరాంధ్ర ప్రాంతంపై దండయాత్ర చేద్దామనుకుంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ ప్రాంతానికి రాజధాని వద్దు అని చెప్పిన తర్వాత, మొట్ట మొదటిసారిగా విశాఖ వచ్చిన చంద్రబాబు నాయుడును, విమానాశ్రయం నుంచే వెనక్కి పంపించిన ఘటనలు మర్చిపోయారా..? అని సూటిగా అడుగుతున్నాం. మా ప్రాంతం మీద దండయాత్రకు వస్తే ఇక్కడ శాంతిభద్రతలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు అమరావతి నుంచి అరసవల్లి  వచ్చేది సూర్యనారాయణమూర్తి దర్శనానికి కాదు కదా?. మీరు వచ్చేది మా ప్రాంత ప్రజల మీద, మా ప్రజల తాలూక ఆత్మాభిమానంమీద దండయాత్రకు వస్తున్నారు. మేము చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నాం. 

- శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు పాదయాత్రగా వచ్చి ఇక్కడ ప్రజలను రెచ్చగొడితే సిగ్గు, లజ్జ వదులుకుని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలు సౌమ్యంగా ఉన్నప్పటికి... ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని దెబ్బతీయాలని వచ్చినప్పుడు, సహజంగానే ప్రజలు తిరగబడతారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. వాటన్నింటిని గుర్తించి మా ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి తిరస్కరించింది. అయితే పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర చేస్తామంటే న్యాయస్థానం కూడా అనుమతి ఇస్తుంది. అయితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని గుర్తుపెట్టుకోవాలి. వీటన్నింటిని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.

రూ1.10 లక్షల కోట్లు అమరావతిపై ఖర్చు పెట్టడం సాధ్యమా..?
        అమరావతి రాజధానికి, 50 వేల ఎకరాల్లో రూ.లక్షా 10వేల కోట్లు ఖర్చు పెట్టాలని గతంలో చంద్రబాబు డీపీఆర్‌ ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో ఆ 29 గ్రామాల అభివృద్ధి తప్ప, మిగతా ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా?. అన్నది చంద్రబాబే చెప్పాలి.  నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూ.15వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు పెడుతున్నాం. నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు మారుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం.  జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టడం ద్వారా..  దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలబడుతోంది.

- చంద్రబాబు చెప్పేది ఎలా ఉందంటే.. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అవసరం లేదు. ఒక్క అమరావతి, అందులోని 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందితే చాలు అనేలా ఉంది. రాష్ట్రం అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టకూడదా? నాడు-నేడు ద్వారా స్కూళ్ళు, ఆసుపత్రులు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు, గ్రామ గ్రామాన వెల్‌నెస్‌ క్లీనిక్‌లు ఏర్పాటు చేయడానికి  డబ్బులను ఖర్చు పెట్టకూడదా? ఈ డబ్బు అంతా తీసుకువెళ్లి అమరావతిలోనే పెట్టాలా?.  ఆ లక్ష కోట్లు తీసుకు వెళ్లి 29 గ్రామాలలో పెడితే చాలు అనేదే చంద్రబాబు నాయుడు ఆలోచన. 
- కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరికీ మేలు జరగాలి, అన్ని ప్రాంతాలకూ గుర్తింపు రావాలన్నదే మా ప్రభుత్వ విధానం. అలాగే అన్ని ప్రాంతాలతో పాటు అమరావతిలోని ఆ 29 గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ అభిమతం. అమరావతి రాజధానిగా ఉండదని, ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం గానీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గానీ ఏనాడూ చెప్పలేదు. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందనే చెప్పాం. 

బాబు జీవితంలో పూర్తి చేసిన ప్రాజెక్టు హెరిటేజ్ ఒక్కటే        
- హైదరాబాద్ నేనే కట్టానంటాడు. 
- ఆ విషయం చంద్రబాబు తప్ప ఎవరూ చెప్పరు. 
-  పైగా, అవుటర్ రింగ్ రోడ్డు నేనే వేశానంటాడు. 
- ఎయిర్ పోర్టు నేనే కట్టానంటాడు. ఆ కాన్సెప్ట్ నాదే అంటాడు. 
- జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్ గారి కాన్సెప్టే. 
- మరి ఏ ఒక్క  ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయాడు..?
- బాబు తన జీవితంలో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు హెరిటేజ్ ప్రాజెక్టు ఒకటే. 
        ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక సామెత గుర్తుకొస్తుంది. ‘చలి చీమలకు రెక్కలు వచ్చినా, గాడిదకు కొమ్ములు వచ్చినా, ముసలివాడికి పిచ్చి పట్టినా ఎక్కువ కాలం నిలబడవని అంటారు’ చంద్రబాబుకు ఈరకం పిచ్చి పట్టినట్లు మాట్లాడటం సిగ్గుచేటు. నాలుగు వందల ఏళ్లు చరిత్ర కలిగిన హైదరాబాద్‌ను తానే కట్టానని బాబు చెప్పుకోవడం చూస్తే ఆయన మాటలను విని ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం  కూడా లేదు.   ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన మాటలు చూస్తుంటే.. ఆఖరికి హైదరాబాద్‌లో చార్మినార్‌ కూడా తానే కట్టానని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ మాటలు వింటే పైనున్న కులికుతుబ్‌ షా కు కూడా ఉరి వేసుకుని మరోసారి చనిపోవాలనిపిస్తుందేమో. ఎక్కడ ఏం జరిగినా అది తన ఘనతేనని, అది తానే చేశానని గొప్పలు చెప్పుకోవడం బాబుకు అలవాటు. ప్రపంచంలో ఎక్కడెక్కడో తెలుగువాళ్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తుంటే అదంతా తనవల్లే అని మాట్లాడతాడు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి శంకుస్థాపన చేస్తే..  ఆ భవనాన్ని ప్రారంభించిన బాబు, హైదరాబాద్‌ అంతా తనవల్లే అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగా చంద్రబాబు హైదరాబాద్‌ శిల్పే అయితే తెలంగాణలో ఆయన పార్టీ పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలి. గడిచిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం ఒక్కటంటే ఒక్కసీటు వచ్చింది. చివరకు హైదరాబాద్‌లో మీకు మిగిలింది ఎన్టీఆర్‌ భవన్‌, ఎన్టీఆర్‌ భవన్‌కు ఉండే వాచ్‌మెన్‌ తప్ప... హైదరాబాద్‌లో మీ రాజకీయ పార్టీకి ఉనికే లేదు కదా?. ఇంకా ఎందుకు గొప్పలు చెప్పుకుంటావు అని ప్రశ్నిస్తున్నాం. 

- మంచి చేస్తే మన గురించి నలుగురు చెప్పుకోవాలి తప్ప... మన గురించి మనం చెప్పుకోవడం అంటే ఒక్క చంద్రబాబు నాయుడునే చూస్తున్నాం. మన గురించి ప్రజలో, మన పక్కనున్న వ్యక్తులో మాట్లాడిన సందర్భాలు చూశాం. కానీ చంద్రబాబు అన్నీ తానే చేశానని చెప్పుకుంటాడు. ఆఖరికి దర్శకుడు శంకర్‌ తనని చూసే ‘ఒకే ఒక్కడు’ సినిమా తీశాడని చెబుతాడు. ఇవన్నీ ఎక్కడ భరిస్తాం. వీటితో పాటు ఔటర్‌ రింగ్‌రోడ్డు, విమానాశ్రయం నాదేనంటాడు. తాను మొదలుపెట్టకపోతే వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు  ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రారంభించేవాళ్లా అని అంటాడు. మరి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు, వైయస్సార్‌ గారు ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయావు..? అంటే సమాధానం ఉండదు.  పైగా అక్కడ ఖైరతాబాద్ లోనూ, ఇక్కడ తాడికొండలోనూ తనను ఓడించారని నిన్న గర్వంగా చెప్పాడు.  నిజంగా అభివృద్ధి చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారు..?

- చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో  పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్‌ హెరిటేజ్‌ మాత్రమే. ఉమ్మడి రాష్ట్రానికి కానీ, ఆంధ్రరాష్ట్రానికి కానీ చంద్రబాబు చేసింది ఏమీలేదు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆద్యుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు.  గతంలో పేదవాడు తన పిల్లల్ని ఇంజినీర్‌, డాక్టర్‌ చదివించుకోవాలనే ఆలోచనే తప్ప .... చదివించుకునే సందర్భాలు లేవు.  ఆక్రమంలో ఆ పేద కుటుంబాలకు ఫీజు రీయింబర్స్ మెంటు పథకాన్ని అమలు చేసి, ఉన్నత విద్యను అందించి, ఐటీ ఉద్యోగాలు, డాక్టర్లగా తీర్చిదిద్దింది వైయస్సార్‌ గారు. దాని ద్వారా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి ఆద్యుడు రాజశేఖర రెడ్డిగారే. చంద్రబాబు బతుక్కి ఏనాడైనా అలాంటి ఆలోచన వచ్చిందా? పేదవాడి ప్రాణం పోతుంటే ఆ ప్రాణాన్ని కాపాడాల్సి బాధ్యత ప్రభుత్వానిదే అని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చిందీ వైయస్సార్‌గారే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక,  ముఖ్యమంత్రిగారు వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చి తద్వారా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు.

- జగన్ గారి పరిపాలనలో మూడేళ్ళలోనే రూ. 1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తే.. చంద్రబాబు హయాంలో రూ. 3 లక్షల కోట్లు.. డీపీటీ అంటే దోచుకో.. పంచుకో.. తినుకో.. స్కీము ద్వారా తాను, తన దుష్టచతుష్టయం దోచుకు తిన్నారు. 

విశాఖ రాజధాని అయితే.. బాబుకు ఎందుకు కడుపు మంట?
        విశాఖకు రాజధానిని తెస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట.. ?. రాష్ట్రంతోపాటు, రాష్ట్రంలో ఉన్న పేదవారందరికీ చంద్రబాబు  చేసింది అన్యాయం. నిన్న చంద్రబాబు విడుదల చేసిన పుస్తకం పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నది. అసలు వాస్తవం ఏంటంటే.. పేదవాడిని చంపి ఉన్నవాడిని పైకి తీసుకురావాలన్నదే చంద్రబాబు ఆలోచన. ప్రజలకు ఏం మేలు చేశాడని చంద్రబాబును ప్రజలు గెలిపిస్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలే కాకుండా, అమరావతి పక్కన ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు కూడా చంద్రబాబు అన్యాయం చేశాడు. ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆ స్టేజి మీద ఉన్నది చంద్రబాబు స్క్రిప్టు చదివే కన్నాతో పాటు మరోపక్క చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి రామకృష్ణ., ఇంకోపక్క ఇందిరా కాంగ్రెస్‌ కాదు... చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు. చివరికి జై రాం రమేష్ ను తిడుతుంటే కూడా చంద్రబాబు-కాంగ్రెస్ నాయకులకు చీమకుట్టినట్టైనా లేదు.   చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి రామకృష్ణ, మిగతా వ్యక్తులు చంద్రబాబు తాబేదారులు. వీరంతా కలిసికట్టుగా రాష్ట్రానికి అన్యాయం చేశారు. 

- తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను ప్రజలకు దూరం చేసి... దానికి దగ్గరైంది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. మీ కుటుంబంతో పాటు అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు కూడా లేనటువంటి నాయకుడు. ఓట్లు గానీ, సీట్లు గానీ లేని డస్ట్‌బిన్‌ లీడర్లను పదిమందిని పక్కనపెట్టుకుని...  చేసిన ప్రసంగాలు అభ్యంతరకరం.  ఉత్తరాంధ్ర, విశాఖ మీద దండయాత్ర చేయడానికి వస్తే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరని మరోసారి హెచ్చరిస్తున్నాం.

- నేను కుల రాజధాని కట్టలేదు అని చెప్పుకోవాల్సిన దుస్థితి చంద్రబాబుకు ఎందుకు వచ్చింది?
- హైవే పక్కన ప్రాంతాన్ని వదిలేసి 10 నుంచి 30 మీటర్లు తవ్వితే తప్ప పిల్లర్లు పడని కృష్ణా బ్యారేజీ ప్రాంతంలో ఎందుకు రాజధాని ప్రకటించాడు..?.. అనే దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. 

- మరోసారి చెబుతున్నాం.. అమరావతి రాజధాని ఉండకూడదని మేము అనటం లేదు. ఉత్తరాంధ్ర రాజధానిగా ఉండటానికి వీల్లేదు అని బాబు అంటున్నాడు కాబట్టే, ఈ యాత్రను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటే దానికి బాబే సమాధానం చెప్పాలని, బాబే బాధ్యత వహించాలని.. అని అంటున్నాం. అల్లూరి సీతారామరాజు, మరెందరో గొప్ప గొప్ప వీరులకు, ఉద్యమకారులకు జన్మనిచ్చిన గడ్డ ఉత్తరాంధ్ర. 

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసి తీరుతాం
        దేశంలోని టాప్‌ టెన్‌ నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఉత్తరాంధ్రకు ముఖద్వారం. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉండాలని ఈ ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు, స్వాగతిస్తున్నారు. 
-  రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యమైన మూడు రాజధానులపై కొత్త బిల్లును తీసుకువస్తాం. దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయనే ఆశతో ఇక్కడి ప్రజలు ఉన్నారు. 
- ఓట్లు, సీట్లు లేని, పూటకో మాట మాట్లాడే పవన్ కల్యాణ్ లాంటి నాయకుల మాటలకు విలువ లేదు. పవన్‌ కల్యాణ్‌ కర్నూలు వెళ్లి ఏమన్నారు..? కర్నూలే రాజధానిగా ఉండాలన్నాడు. బీజేపీ వాళ్ళు కూడా రాయలసీమలో హైకోర్టు పెట్టాలని, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజు యూ-టర్న్ లు తీసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.   

తాజా వీడియోలు

Back to Top