వైయ‌స్ఆర్‌సీపీలో నూతన నియామకాలు 

 తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను  పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కర్నూలు, నంద్యాల జిల్లాల కో-ఆర్డినేటరుగా భూమన కరుణాకరరెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్.వెంకటగౌడ, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా భూమన అభినయరెడ్డి నియమితులయ్యారు.

పార్టీ సీఈసీ సభ్యునిగా రంగాలి జగన్నాథం (విశాఖపట్నం నార్త్), ఎస్‌ఈసీ సభ్యులుగా పరిస వెంకటనారాయణ (విశాఖపట్నం ఈస్ట్), గుండుబోగుల నాగేశ్వరరావు(తాడేపల్లిగూడెం), సమంతలపూడి బాలసూర్యనారాయణ రాజు (పోలవరం), ఓ.ఎం.పి మధుసూదన్ రావు (చిత్తూరు) నియమితులయ్యారు.

Back to Top