రాధాకృష్ణా.. నీది జర్నలిజం కాదు.. పచ్చి బ్రోకరిజం

మా వైపు, మా ఇంటి మహిళల జోలి కొస్తే తాట తీస్తాం

ఏబీఎన్‌ రాధాకృష్ణపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

నెల్లూరు వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

‘మావిగన్‌’ దెబ్బకు టీడీపీ కూటమి కుదేలు

బద్దలవుతున్న అమరావతి అవినీతి కోటలు 

అందుకే ఏబీఎన్‌ రాధాకృష్ణ నీచ విన్యాసాలు

నీది ‘కొత్త పలుకు’ కాదు. అది ఒక ‘చెత్తపలుకు’

నీ రాతలను నీ కూతురూ అసహ్యించుకుంటుంది

ఏబీఎన్‌ రాధాకృష్ణపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కాకాణి

జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న చంద్రబాబు

ఏం చేసి అయినా సరే, చంద్రబాబుకు జాకీ ఎత్తడమే మీ పని

అందుకే నిర్లజ్జగా మహిళలపై నీచమైన రాతలు రాస్తున్నావు

మహిళల ఆత్మగౌరవాన్ని కించ పరుస్తున్న నీకు సిగ్గుందా? 

నీ బతుకంతా అనైతికం.. నీ చరిత్ర మొత్తం అవినీతి మయం

నువ్వా మా కుటుంబాల గురించి మాట్లాడేది?

ఆంధ్రజ్యోతి పత్రిక కాదు.. అది దళారుల కరపత్రం

రాధాకృష్ణా, నిన్ను నడిరోడ్డుపై నిలబెట్టడం ఖాయం

మా కుటుంబ సభ్యులపై విషం చిమ్మితే సహించం

ఏబీఎన్‌ రాధాకృష్ణా.. నీ కౌంట్‌డౌన్‌ మొదలైంది

ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి సీరియస్‌ వార్నింగ్‌

నెల్లూరు: జగన్‌గారు ప్లాన్‌–బీ గా ప్రతిపాదించిన ‘మావిగన్‌’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్‌తో కూటమి నేతల అవినీతి కోటలు బద్దలవుతుంటే, ఆ భయంతోనే ఎల్లో మీడియా జుగుప్సాకరమైన వ్యక్తిత్వ హననానికి దిగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్ని చేసినా, జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారని, దీంతో నిత్యం జాకీలతో చంద్రబాబును ఎత్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ ఓర్చుకోలేకపోతున్నారని, అందుకే తమ పార్టీ నాయకులు, మహిళలపై నిర్లజ్జగా రాతలు రాçస్తున్నారని ఆయన  ఆక్షేపించారు. ఇది రాధాకృష్ణ దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు.
    ‘చెత్తపలుకు’ పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని, ఇలాంటి దిగజారిన బ్రోకరిజం చేస్తున్న రాధాకృష్ణను సమాజం నడిరోడ్డుపై నిలబెట్టి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. తన సొంత జీవితంలో అనైతిక చరిత్ర కలిగిన రాధాకృష్ణకు పవిత్రమైన కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడే అర్హత లేదని, మరొక్కసారి తమ  మహిళల జోలికొస్తే తాట తీస్తామని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

మావిగన్‌ చర్చతో కూటమిలో వణుకు: 
    రాష్ట్ర రాజధానిపై ప్లాన్‌–బీ గా జగన్‌గారు ప్రతిపాదించిన మావిగన్‌పై రాష్ట్రవ్యాప్తంగా విçస్తృత చర్చ జరుగుతోంది, ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు తన ఎల్లో ముఠాను రాక్షసుల్లా రంగంలోకి దించారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ ట్రోలింగ్‌ చేయిస్తున్నారు. జగన్‌గారిని ఎంత ఎక్కువగా దూషిస్తే ఎమ్మెల్యేలకు అంత ఎక్కువ ర్యాంకింగ్‌ ఇస్తామని చంద్రబాబు టార్గెట్‌ పెట్టారు. అందుకే కూటమి నేతలు అన్నీ వదిలి, కేవలం జగన్‌గారిపై  వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.

రాధాకృష్ణ చెత్త పలుకు. నీచానికి పరాకాష్ట:
    ఏబీఎన్‌ రాధాకృష్ణ కొత్తపలుకులో అత్యంత దిగజారి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, నాయకుల కుటుంబ సభ్యులు, వారి భార్యల గురించి మాట్లాడటం ఆయన నీచ బుద్ధికి నిదర్శనం. రాధాకృష్ణ కడుపుకు అన్నం తింటే, తను ఒక మనిషి అయితే ఇలాంటి మాటలు మాట్లాడడు. నీ చండాలమైన భాష చూసి నీ కూతురు నిన్ను అసహ్యించుకుంటుంది. రాధాకృష్ణా, నీ బతుకంతా అవినీతిమయం. నీ జీవితంలో ఎంత వెతికినా నీతి, నిజాయితీ కనిపించవు.
    రాధాకృష్ణా, నీవు పెళ్లి చేసుకోకుండానే మరో మహిళతో ఉంటున్నావని, నీ దగ్గర పీఏగా పని చేసిన మహిళతో అక్రమంగా బిడ్డను కన్నావని ప్రచారం జరుగుతోంది. ఇంత నీచమైన చరిత్ర ఉన్న నువ్వు మా ఇంటి మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చిన విమర్శలకు ఏ రోజైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? మహిళలను అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్‌ నుంచి పార్టీని, గుర్తును, డబ్బును లాక్కోవడంలో చంద్రబాబుకు బ్రోకర్‌గా వ్యవహరించిన నువ్వా మా గురించి కామెంట్‌ చేసేది.

ఇది జర్నలిజం కాదు.. దళారీల కరపత్రం:
    జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ నూరు శాతం బ్రోకరిజం చేస్తున్నాడు. అసలు ఆంధ్రజ్యోతి పత్రిక కాదు. అది దళారీల కరపత్రం. నీ నీచమైన రాతలు మా పిక్క మీద వెంట్రుక కూడా పెరకలేవు. ఇప్పటికే తటస్థులు నీ పత్రికను బహిష్కరిస్తున్నారు, త్వరలోనే మహిళలు నీకు బుద్ధి చెప్పడం ఖాయం. 
    ఇంకా తనకు భయం లేదని రాధాకృష్ణ చెప్పుకుంటాడు. కానీ ఆయనకు అసలు లేనిది భయం కాదు, సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద. ఒంటరిగా బరిలో నిలిచి పోరాడుతున్న మాకు వెన్నుముక ఉంది. కానీ, అందరినీ కలుపుకుని, చెత్త పత్రికలను అడ్డు పెట్టుకుని వస్తున్న చంద్రబాబుకు, నిత్యం ఆయనకు జాకీ ఎత్తుతున్న మీకే వెన్నుముక లేదు.

రాధాకృష్ణా.. నీ తాట తీయడం ఖాయం:
    రాధాకృష్ణా, మరోసారి మా మహిళల జోలికొస్తే నీ తాట తీస్తాం. ఏ మాత్రం సభ్యత, సంస్కారం లేకపోవడంతో పాటు, జర్నలిజమ్‌ ముసుగులో బ్రోకరిజమ్‌ చేస్తున్న నిన్ను సమాజంలో నడిరోడ్డుపై నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నీకు ఎప్పటికైనా ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. జగన్‌గారు తిరిగి అధికారంలోకి వస్తారన్న భయం మీలో మొదలైంది. అందుకే ఇంతలా దిగజారిపోయారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రాతలు రాస్తున్నారు. అందుకే ఏబీఎన్‌ రాధాకృష్ణకు భవిష్యత్తులో తప్పనిసరిగా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top