ఏపీని పట్టి పీడిస్తోన్న 'నారా ' వైరస్‌..!!

రాజకీయాల్లో అధికారం పొందటం ఎంత ముఖ్యమో.. బాధ్యత కూడా అంతకంటే ముఖ్యం. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ప్ర‌జారంజ‌క ప‌రిపాల‌న చేస్తూ.. అనుకోని విప‌త్తు క‌రోనా రూపంలో వ‌చ్చి మీద‌ప‌డినా చిరున‌వ్వుతో భ‌రిస్తూ.. త‌న ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ హానీ రానివ్వ‌కుండా ప్ర‌తి ఇంటి పెద్ద‌కొడుకులా బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కానీ,  2019లో అధికారంలో కోల్పోయిన చంద్రబాబు తన అబద్దాలకు మరింత పదును పెట్టారు. అను 'కుల' మీడియాను మరింత పదునెక్కించారు. ప్రభుత్వం ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా మంచిచెడు ఆలోచించకుండా మాట్లాడటం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అలవాటైంది. ఎస్పీ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎదగడానికి చంద్రబాబు అడ్డదారులు, అబద్దాలనే నమ్ముకున్నారు కాబట్టి.. నేటికీ ఆ సిద్ధాంతాల‌నే ఫాలో అవుతున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంతో ముఖ్యమో ఆయన అనుభవంతో కూడా తెలుసుకోలేక పోయారు. 1995లో ఎన్టీఆర్ దగ్గర నుంచి సీఎం పదవి లాక్కున్నప్పటికీ.. 1999లో బీజేపీతో పొత్తుతో సీఎం అయిన తరువాత కూడా చంద్రబాబు ఆలోచన, ప్రవర్తనల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అవే అడ్డదారులు, అవే అబద్దాలు, అవే ప్రలోభాలు. నీతి, నిజాయితీ, విలువలను చంద్రబాబు తన దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. చంద్రబాబుకు తన మీద కంటే కూడా తన అను 'కుల' మీడియా మీదనే ఎక్కువ నమ్మకం. ప్రజలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. 

వైర‌స్‌పై పోరులో ముందు వ‌రుస‌లో ఏపీ..
వైరస్‌లు చెప్పిరావు. ఇదిగో వస్తున్నాని హారన్‌ మోగించుకుంటూ ఎంట‌ర్ అవ్వ‌వు. కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టింది అనే దాని మీద వాదోపవాదనలు ఉన్నప్పటికీ కోవిడ్ -19 కూడా చెప్పి రాలేదు కదా..!!. ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. ఒకటి, రెండో ప్రపంచ యుద్దాల తరువాత అత్యధిక ప్రాణ నష్టం జరగడాన్ని చూస్తున్నాం. కరోనాను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు అన్నీ ఏకతాటి మీదకు వచ్చాయి. ఒకరికొకరు సహకరించుకుంటూ కరోనాపై పోరాడుతున్నారు. ఇండియా కూడా కరోనాపై పోరులో ముందుంది. వైర‌స్‌పై పోరులో దేశంలోనే ఏపీ ముందుంది. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి ముందు చూపు ఏపీని కరోనా కోరల నుంచి రక్షిస్తోంది. కానీ..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బాధ్యత మరిచి ఇష్టమొచ్చినట్లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేసేలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాటలను బ్రేకింగ్‌లు వేసి అను 'కుల' మీడియా ప్రజలను మరింత భ్రయబ్రాంతులకు గురిచేస్తోంది. 

చంద్ర‌బాబువ‌న్నీ అవ‌కాశవాద రాజ‌కీయాలు..
చంద్రబాబు మాట తీరు చూస్తుంటే ఏపీ రావణకాష్టం కావడంలేదనే బాధ ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఏపీ మంత్రి మండలి సమావేశం అయిన రోజునే ..టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం పెట్టారు. ఏపీ మంత్రి మండలి కోవిడ్‌పై  తీసుకునే నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకోవడానిక చంద్రబాబు యత్నించారు. పొలిట్ బ్యూరో సమావేశం తరువాత జూమ్‌లో  మాట్లాడుతూ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్నాడు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన బాధ్యత ఉన్న నేతగా కాకుండా.. ఫక్తు అవకాశవాద రాజకీయ నాయకుడిగా మాట్లాడారు. ఒక పక్క ప్రభుత్వం కరోనాతో యుద్ధం చేస్తుంటే.. సహకరించకుండా, సూచనలు, సలహాలు ఇవ్వకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా జూమ్‌లో మాట్లాడారు. 

తెర మీద‌కు ఎన్‌ 440కే వైరస్ పేరు టీడీపీ కుట్ర‌లో భాగ‌మే..
"కరోనాతోనే చాలా మంది చనిపోతున్నారని" వైద్యులు ఒక పక్క చెబుతున్నా కూడా చంద్రబాబు భయపెట్టే మాటలు మానలేదు. 8 నెలల క్రితం పుట్టి అప్పుడే కనుమరుగైన ఎన్‌ 440కే వైరస్‌ గురించి చంద్రబాబు ఈ సమయంలో మాట్లాడటాన్ని ఎలా అర్ధం  చేసుకోవాలి..?  ఈ విషయంలో చంద్రబాబుకు దురుద్దేశంలేదని అనడానికి వీల్లేదు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలనే రాజకీయ పథకంలో భాగంగానే చంద్రబాబు ఎన్‌ 440కే వైరస్‌ గురించి ప్రస్తావించారు. ఎన్‌ 440కే వైరస్ కర్నూలు జిల్లాలో పుట్టిందని, కరోనా కంటే ప్రమాదకరమని, వేగంగా విస్తరిస్తుందంటూ చంద్రబాబు అబద్దాలు చెప్పడం వెనక రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయని సులభంగానే ఊహించుకోవచ్చు. 

క‌ర్నూలుపై అంత కోప‌మెందుకు బాబూ..?
ఎన్‌ 440కే ప్రభావంలేదని సైంటిస్ట్‌లు, వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారు. 8 నెలల క్రితం తెలంగాణలో ఎన్‌ 440కే వైరస్‌ పుట్టిందని, దాని ప్రభావం ఏం లేదని సీసీఎంబీ మాజీ సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథ‌రావు చెప్పారు. ఎప్పుడో 8 నెలల క్రితం తెలంగాణలో పుట్టిన వైరస్‌ ఏపీలోని కర్నూలు జిల్లాలో పుట్టి, వేగంగా వ్యాప్తి చెందుతుందని  చంద్రబాబు, ఆయన అను 'కుల'మీడియా ప్రచారం వెనక దురుద్దేశాన్ని సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. ఇక..చంద్రబాబు నాయుడు ఎన్‌ 440 కే పుట్టుకకు కర్నూలునే ఎందుకు ఎంచుకున్నారనే దానికి  ఆ జిల్లా అంటే ఆయనకు మహా కోపం. 2014లో కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లలో వైయ‌స్‌ఆర్‌ సీపీ 11 గెల్చుకుంది. 2 ఎంపీ సీట్లూ కైవసం చేసుకుంది. 2019లో కర్నూలు జిల్లాలో వైయ‌స్ఆర్ సీపీ స్వీప్ చేసింది. మళ్లీ రెండూ ఎంపీ సీట్లు గెల్చుకుంది. ఈ కారణంతోనే చంద్రబాబు తన పగను కర్నూలు జిల్లాపై తీర్చుకుంటున్నాడనేది తేట‌తెల్లం.  

వ్యాక్సిన్ల పంపిణీ బాధ్య‌త కేంద్రానిద‌ని తెలియ‌దా..?

ఇంత‌టితో ఆగ‌కుండా వ్యాక్సిన్ల‌పై త‌ప్పుడు ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి కంపెనీల చేతుల్లో.. పంపకం కేంద్రం చేతుల్లో ఉంటుందని తెలిసి కూడా చంద్రబాబు అబద్ధమాడుతున్నారు. ఇండియాలో రెండు కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లకు అవసరాలకు చాలా వ్యత్యాసం ఉంది.  అందుకే.. రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌కు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. జూలై - ఆగస్ట్ నాటికి మన దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినా కూడా వ్యాక్సిన్లు అవసరాలకు తగినట్లుగా సరిపోవు అనేది వాస్తవం. టీకాల ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపట్టి  రాష్ట్రాలకు అవసరాల మేరకు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ.. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా  సేకరించేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించామంటూ  మోదీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సీఎం వైయ‌స్ జగన్‌ దూరదృష్టితో అడుగులు వేస్తున్నారు. కోవిడ్‌పై  యుద్దంలో వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఇవేమీ తెలియని వాడిలా చంద్రబాబు నోరు పారేసుకోవడాన్ని ప్రజలు చూస్తున్నారు. 

ఒక్క రోజులో 6 ల‌క్ష‌ల కోవిడ్ టీకాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ..
ప్రస్తుతం వ్యాక్సిన్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే  నెలకు 3.5 కోట్ల మందికే వ్యాక్సిన్లు వేసేందుకు అవకాశం ఉంది. జూలై - ఆగస్ట్ నుంచి ఉత్పత్తి సామర్థ్యం ప్రణాళికలు వాస్తవ రూపం దాల్చితే రెండు కంపెనీల ఉత్పత్తి నెలకు 16 కోట్ల డోసులు చేరవచ్చు. ఇటీవలే ఏపీలో ఒకేరోజు ఆరు లక్షల మందికి టీకాలు ఇచ్చారు. దాదాపు 40వేల మంది ఆశ కార్యకర్తలు, 19వేల మంది ఏఎన్‌ఎంలు, వేలల్లో వైద్యుల తోపాటు రెండు లక్షల మందికిపైగా గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఈ  మహాయజ్ఞంలో పాల్గొన్నారు.  ఒక్క రోజులోనే  6 లక్షల మందికి కోవిడ్  టీకాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. ఈ లెక్కన నెలలో 25 రోజులు పని చేసినా 1.50 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చు. ఏపీ జనాభా 5.30 కోట్లు కాగా ఇందులో వ్యాక్సిన్‌కు అర్హులు 3.48 కోట్ల మంది.  తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే రాష్ట్రంలో ఎప్పుడో వ్యాక్సిన్ల  ప్రక్రియ పూర్తయ్యేది. ఈ విషయం చంద్రబాబుకు తెలిసి కూడా జూమ్‌లో అడ్డమైన వాగుడు వాగడాన్ని ఎలా అర్ధం  చేసుకోవాలి..?. 

కోవిడ్ నియంత్ర‌ణ‌పై అధికారుల‌కు సీఎం దిశానిర్దేశం..
కరోనాపై పోరులో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డి ముందు నిలబడి యుద్దం చేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించారు. ఆక్సిజన్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లకు ఓకే చెప్పారు. కరోనాపై యుద్దంలో  భాగంగా  ఇప్పటికే 16,981 మంది  సిబ్బందిని నియమించారు. 104 కాల్ సెంటర్‌ను బలోపేతం చేసి సేవలు వేగవంతం చేశారు.  మే6న ఒక్కరోజే  104కు 17, 649 మంది కాల్ చేశారంటే ప్రజలకు వైయ‌స్‌ జగన్‌ పాలన పట్ల విశ్వాసాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. 104 కు కాల్  చేసిన 3 గంటల్లోనే బెడ్ కేటాయించాలని సీఎం జగన్‌ ఆదేశాలను అధికారులు వేగంగా అమలు చేస్తున్నారు. ఇంతగా కరోనాపై యుద్దం చేస్తుంటే చంద్రబాబు మాత్రం క్షుద్ర రాజకీయాలు చేయడం దేనికి నిదర్శనం..?

క‌రోనాపై యుద్ధంలో ముందు వ‌రుస‌లో వ‌లంటీర్లు..
అవకాశం వచ్చినప్పుడల్లా  చంద్రబాబు వలంటీర్లను చంద్రబాబు ఆడిపోసుకుంటాడు. గోనె సంచులు మోసుకోవడానికా వలంటీర్లు అంటూ హేళన కూడా చేశారు. మగాళ్లులేనప్పుడు తలుపులు కొట్టడానికా  అంటూ నోరుపారేసుకున్నాడు. ఇప్పుడు ఆ వలంటీర్లే కరోనాపై యుద్ధంలో ముందున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేస్తూ విలువైన సమాచారం ఇస్తున్నారు. బాధితుల తరపున 104కు కాల్ చేస్తూ  బెడ్‌లు కేటాయించేలా చూస్తున్నారు. కరోనా బారినపడి ఎవరైనా చనిపోతే బంధువులు, స్నేహితులు కూడా రాకపోతే దగ్గరుండి అంత్యక్రియలు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమని చంద్రబాబు నాయుడు ఏనాడైనా ప్రశ్నించుకున్నారా..? ప్రశ్నించుకుంటే నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడుతారు..? వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ముందుచూపుతోనే కదా ఈ రోజున ఏపీ ఒక్కరోజులోనే 6 లక్షల టీకాలు వేయగలిగింది. 

మోదీని విమ‌ర్శించే ధైర్యం చంద్ర‌బాబుకు లేదా..?
చంద్రబాబుకు ఏపీ ప్రజల మీద ప్రేమ ఉంటే విమర్శలు మానుకుని ప్రధాని లేఖ రాయవచ్చు అని  మంత్రి పేర్ని నాని అడిగారు. ఆయన అడిగిన దాని కోసమైనా ప్రధానికి చంద్రబాబు లేఖ రాయవచ్చు. కానీ.. రాయరు. ఈయనగారి లేఖను ప్రధాని మోదీ చెత్తబుట్టలో వేస్తారు అనే విషయం చంద్రబాబుకూ తెలుసు. వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంపై రోజూ జూమ్‌లో ఆరిపోసుకునే చంద్రబాబు మోదీని ఒక్క మాట కూడా అనరు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయి ఉండి చంద్రబాబు జాతీయ అంశాలపై ఎందుకు స్పందించరు..?. మోదీనే అనే ధైర్యం చంద్రబాబుకు లేదా..?. దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు దేశీయ అంశాలపై ఎందుకు స్పందించరు..?. మోదీపై 2019 ఎన్నికలకు ముందు రాయించినట్లు ఇప్పుడు ఎందుకు రాయించడం లేదు..?. సీఎం వైయ‌స్‌ జగన్‌ను మాత్రం విమర్శిస్తారు..! అంతేకాదు..ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారు..!!. యూరోపియన్ దేశాల్లో అయితే చంద్రబాబు మాట్లాడిన మాటలకు ఈ పాటికి జైల్లో వేసేవారు.. లేకపోతే మానసిక వైద్యుడికి చూపించేవారు..!!.  

ప‌చ్చ‌మంద కుట్ర‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఏం చేయ‌లేవు..
వైయ‌స్ఆర్‌ ఎప్పుడూ ఒక మాట చెబుతుండే వారు "ఎన్నాళ్లు బతికామనేది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం". ఈ మాటలను ఒక్కసారి చంద్రబాబు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. వైయ‌స్‌ఆర్‌ అకాల మరణం చెంది దశాబ్దం దాటిన తరువాత కూడా  ప్రజల గుండెల్లో కొలువై ఉండటానికి కారణం పై మాటలకు ఆయనకు కట్టుబడ్డారు. బతికినంత కాలం వైచ‌స్ఆర్ ప్రజల కోసమే బతికారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి కూడా తండ్రి చూపిన బాటలోనే పాలన చేస్తున్నారు.  ప్రజల కోసం వైయ‌స్ఆర్ రెండు అడుగులు ముందుకు వేస్తే..సీఎం వైయ‌స్‌ జగన్‌ 10 అడుగులు ముందుకు వేస్తున్నారు. అందుకే.. రోజురోజుకు సీఎం వైయ‌స్ జగన్‌పై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ప్రజల ఆశీర్వాదంతో వారి అండదండలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ కరోనాపై యుద్ధంలో జయిస్తారు. చంద్రబాబు కుట్రలు, అను 'కుల' మీడియా అడ్డుకట్టలు సీఎం వైయ‌స్‌ జగన్‌ను అడ్డుకోలేవు అనేది  వాస్తవం.

Back to Top