సీఎం వైయస్‌ జగన్‌ చొరవతోనే గెజిట్‌  విడుదల

అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి
 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతోనే కృష్ణా నదీ జలాలపై కేంద్రం గెజిట్‌ విడుదల చేసిందని అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు  తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 
కృష్ణా నది నీటిపై తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి చేసి నీటిని సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితిని చూశాం. ఇదే అంశంపై తెలంగాణ మంత్రులు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో సంయమనంతో ఏ రైతుకు కూడా నష్టం జరుగకూడదని, మా వాటా నీటినే మేం వాడుకుంటున్నామని, విద్యుత్‌ ఉత్పత్తి పెద్ద తప్పిదమని కేంద్రానికి లేఖలు రాశారు. దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం నిన్న గజెట్‌ రిలీజ్‌ చేసింది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి నీటి విడుదలను తీసుకువస్తూ ..వాటికి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని, ప్రాజెక్టులు కేంద్ర బలగాల చేతిలో ఉంటాయని కేంద్రం గెజిట్‌లో పేర్కొంది. సీఎం వైయస్‌ జగన్‌ లోతు ఆలోచనలు, సంయమనంతోనే ఈ గెజిట్‌ వచ్చింది.   

ఆవేశాలు సమస్యలకు పరిష్కారం కాదు..ఆలోచనతో చేసే పనులే రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి సారి వైయస్‌ జగన్‌ చూపిస్తున్న చొరవ, నిబ్బరం, ఆలోచన మంచి ఫలితాలు ఇస్తోంది. ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారు. మా నీటి వాటానే వాడుకుంటున్నాను. విద్యుత్‌ ఉత్పత్తి సరికాదని రాజ్యాంగబద్ధంగా పోరాటం చేశారు. విద్యుత్‌ను ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. ప్రకాశం బ్యారెజీ నుంచి నీటిని సముద్రం నుంచి తెచ్చుకోవచ్చా? వైయస్‌ జగన్‌ చొరవతోనే గెజిట్‌ వచ్చింది. కృష్ణా నది అత్యధిక జనాలకు తాగునీరు, సాగునీరు ఇస్తోంది. బ్రిటిష్‌ ట్రిబ్యూనల్‌ ఎక్కడా కూడా బజావత్‌ ట్రిబ్యూనల్‌ను వ్యతిరేకించలేదు. లేని నికర జలాలను తీసుకోవడం అన్యాయమని మనం వ్యతిరేకించాం. వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఒక్కరు కూడా ఏపీలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వైపు చూడలేదు. ఇవాళ హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఎన్టీరామారావు పేరు పెట్టారు కానీ ఎక్కడా కూడా చంద్రబాబు పనులు చేయలేదు. కానీ వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూశారు. జలయజ్ఞంలో మొదలుపెట్టిన పులిచింతల ప్రాజెక్టు, అలీసాగర్‌ ప్రాజెక్టు, రాయలసీమలోని ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు ఇవాళ పూర్తి అయ్యేందుకు వచ్చాయంటే అది వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవనే. ఇది అందరికి తెలిసిన వాస్తవం. దీన్ని మభ్యపెట్టి వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని విమర్శించాలనుకుంటే  ప్రజలకు అన్ని తెలుసు. రెండు రాష్ట్రాలకు సంబం«ధించిన గెజీట్లో సమానంగా వాటాలు ఇచ్చారు. గతంలో శ్రీకృష్ణా కమిటీ ముందు రైతు సంఘం నాయకులుగా రెండు గంటల పాటు అన్ని అంశాలు చర్చించాం. అంటోనీ కంపెనీకి కూడా రాష్ట్ర విభజన సమస్యలను వివరించాం. బ్రీజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ కూడా ఇదే చెప్పింది. నదీ పుట్టిన మహాబలేశ్వరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఒక అథారిటీ ఉండాలి. అథారిటీ కంట్రోల్‌ లోనే రాష్ట్రాలు నీళ్లు తీసుకోవాలి. అది లేకపోతే..గతంలో చూశాం. శ్రీశైలంలో తాగునీరు కూడా రాని పరిస్థితి చూశాం. కర్ణాటక, మహారాష్ట్రాలు ఎన్ని నీళ్లు వాడుకుంటున్నాయో ఎవరికి తెలుసు. అథారిటీ అన్నది కృష్ణా బోర్డు పరిధిలో ఉండాలి. ట్రిబ్యూనల్‌ కేటాయించినట్లుగానే మాకు రావాల్సిన వాటాను మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కేంద్రం తండ్రి పాత్ర పోషించాలి. నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన యాజమాన్య బోర్డుకు అన్ని అధికారాలు ఉండాలి. అన్ని నదులపై ఉన్న ప్రాజెక్టులను రైతు సంఘం నాయకుడిగా తాను పరిశీలించాను. 2004కు ముందు మన రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. సీఎం వైయస్‌ జగన్‌మాదిరిగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంయమనం పాటించి నీటి సమస్యను పరిష్కరించుకోవాలని ఎంవీఎస్‌ నాగిరెడ్డి కోరారు. నీటి వాటా ప్రకాశం ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా..మా వాటా నీటిని మాకు కేటాయించాలని ఎంవీఎస్‌ నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top