మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం 

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి 
 

  తాడేపల్లి : రైతు పంటలకు మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్నారని అన్నారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్‌ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి 
వైయస్‌ జగన్‌ పాలనలో 14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని,  2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు పాలనలో ఏనాడు తన కెబినెట్‌లో వ్యవసాయం గురించి చర్చించలేదని ఆరోపించారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1100 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చారని నాగిరెడ్డి గుర్తు చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top