ఎన్‌ఆర్‌సీ అమలు చేసే ప్రసక్తే  లేదు

ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

 అనంతపురం: మైనార్టీలకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top