నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుంది

ముఖేష్‌ అంబానీ 
 

విశాఖ‌:  నూత‌న భార‌త దేశ నిర్మాణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కీల‌కం కాబోతుంద‌ని ప్ర‌ముఖ దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. విశాఖ‌లో నిర్వ‌హించిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో పాల్గొన్న అంబానీ సంతోషం వ్య‌క్తం చేశారు. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయ‌న్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చార‌ని చెప్పారు.  
ముఖేష్ అంబానీ ఏమ‌న్నారంటే..

 

  • గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. 
  • ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. 
  • ఆంధ్ర రాష్ట్రానికి వరం సమృద్ధిగా ఉన్న వనరులు.
  • సమృద్ధిగా సారవంతమైన భూములు, సహజ వనరులు, ప్రతిభ,  సంస్కృతి కల రాష్ట్రం ఏపీ. 
  • విశాఖ వంటి సహజ సముద్రతీరాలు, సహజ సంపదలైన గోదావరి, కృష్ణా వంటి నదులు, తిరుపతి కొండలు 
  • ఇవే కాక మరో మూడు సామర్థ్యాలు ఏపీకి వున్నాయి
  • ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. 
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మాకున్న బెస్ట్ ప్రొఫెషనల్ మేనేజర్స్ లోనూ కొందరు తెలుగు వారు ఉన్నారని గర్వంగా చెబుతున్నాను. 
  • రానున్న దశాబ్దాల్లో బ్లూ ఎకానమీలో అభివృద్ధి వేగవంతం కాబోతోంది. 
  • ఆంధ్రప్రదేశ్ లో రానున్న రోజుల్లో ఆక్వా రంగంలో విస్తృతమైన అవకాశాలు మనముందుకు రాబోతున్నాయి. 
  • దేశంలోనే రెండువ అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ. 
  • రినోవబుల్ ఓషన్ ఎనర్టీ రంగంలో, సీ బెడ్ మినరల్స్, మెరీన్ బయో టెక్నాలజీ రంగాల్లో ఏపీ అత్యున్నత స్థానానికి వెళ్లగలదు.
  • ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోంది. అలాగే ఏపీ సైతం సీఎం వైయస్ జగన్ వంటి యువ నాయకుని నేతృత్వంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. 
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అత్యుత్తమ స్థానంలో నిలిచినందుకు ఈ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి గారికి అభినందనలు.
  • పారిశ్రామికాభివృద్ధిలో దేశంలోనే శక్తివంతమైన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందనడంలో నాకు సందేహం లేదు. 
  • ఆంధ్రప్రదేశ్ 
  • సుమారు లక్షా యాభై వేల కోట్ల పెట్టుబడులను KGD 6 గ్యాస్ పాప్ లైన్ల నిర్మాణంలో పెట్టాము. భారత్ ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువులో 30% KGD 6 బేసిన్ ద్వారా రిలయన్స్ భాగస్వామ్యం ఉంది. భారత ఆర్థిక ప్రగతిలో ఏపీకి ఇందుకే ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. 
  •  2023 చివరకల్లా ఏపీ సహా జియో 5G భారత్ నలుమూలలా అందుబాటులోకి రానుంది. రిలయన్స్ రిటైల్ ద్వారా ఆరువేల గ్రామాల్లోని సుమారు 1.2లక్షల మంది రిటైల్ వ్యాపారస్తులు ఇందులో భాగస్వాములౌతున్నారు. ఈ డిజిటల్ విప్లవంలో రిలయన్స్ రీటైల్ 20వేల ప్రత్యక్ష ఉద్యోగాలను, వేలాదిగా పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తోంది. 
  • మునుముందు మరింతగా విస్తరిస్తూ రాష్ట్రంలోని అగ్రి, ఆగ్రో బేస్డ్ ఉత్పత్తులను, మేనిఫేక్చర్ గూడ్స్ ను ఏపీ నుండి దేశ వ్యాప్తంగా అమ్మకాలు జరుపనున్నాం. తద్వారా 50వేల మందికి ఉపాధి లభించనుంది.  
  • సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు, అభివృద్ధి, విద్యా వికాసానికి రిలయన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది. 
  • ఏపీ ప్రజలు, ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను..రాష్ట్ర అభివృద్ధిలో మేమూ భాగస్వాములమవుతాము. ఏపీలో మరిన్ని పెట్టుబడులను కొనసాగిస్తాము. 
  • 10 గిగావాట్స్ రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. 
  • ఈ ప్రభుత్వ సహకారానికి, ఈ సమ్మిట్ లో ఆహ్వానానికి మనఃస్ఫూర్తిగా సీఎం గారికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
Back to Top