కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

క‌ర్నూలు: కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ స‌భ్యుడు యర్రబోతుల పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన జెడ్పీ చైర్మ‌న్‌, ఎంపీపీ, వైఎస్‌ ఎంపీపీల ఎన్నిక మంగళవారం జరిగింది. 

చిత్తూరు జిల్లా:
► చంద్రగిరి మండల రెండో  వైస్ ఎంపీపీగా తొండవాడ ఎంపీటీసీ నిరంజన్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
► ఎర్రావారిపాళ్ళెం మండల రెండో  వైస్ ఎంపీపీగా ఉస్తికాయాలపెంట ఎంపీటీసీ నాగేశ్వరరావు ఏకగ్రీవ ఎన్నిక
► చిన్నగొట్టిగల్లు మండల రెండో వైస్ ఎంపీపీగా తిప్పిరెడ్డిగారిపల్లి ఎంపీటీసీ దామోదర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
► చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెండో వైస్ ఎంపీపీగా ఎన్‌వీ చలపతి ఏకగ్రీవంగా ఎన్నిక
► చిత్తూరు జిల్లా కలకడ మండలం రెండో ఎంపీటీసీగా శ్రీమతి కృష్ణకుమారి ఎన్నిక
► వి.కోట మండలం రెండో వైస్ ఎంపీపీగా డాక్టర్. తమిమ్ ఏకగ్రీవంగా ఎన్నిక
► కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం రెండవ వైస్ ఎంపీపీగా సరస్వతి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.

తూర్పు గోదావరి జిల్లా:
► రాజవొమ్మంగి మండలం వైస్ ఎంపీపీ-2గా వాతంగి ఎంపీటీసీ జుర్ర రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
► అడ్డతీగల మండలం వైస్ ఎంపీపీ-2గా గొంటువాణిపాలెం ఎంపీటీసీ గంధం బాల సుబ్రమణ్యం  ఏకగ్రీవంగా ఎన్నిక
► వై రామవరం మండలం వైస్ ఎంపీపీ-2గా కోట ఎంపీటీసీ ముర్ల జోగిరెడ్డి  ఏకగ్రీవంగా ఎన్నిక
► గంగవరం  మండలం వైస్ ఎంపీపీ-2గా  లాక్కొండ ఎంపీటీసీ కె గంగా దేవి ఏకగ్రీవంగా ఎన్నిక.

అనంతపురం జిల్లా: 
► బుక్కరాయసముద్రం మండలం వైస్ ఎంపీపీగా రెడ్డిపల్లి జయలక్ష్మి ఎన్నిక
► పుట్లూరు మండలం వైస్ ఎంపీపీగా నొస్సం లక్ష్మి నారాయణమ్మ ఎన్నిక
► రాప్తాడు మండలపరిషత్ రెండవ ఉపాధ్యక్షులుగా మన్నల వరలక్ష్మి ఎన్నిక
► అనంతపురం రూరల్ మండలపరిషత్ రెండవ ఉపాధ్యక్షులుగా కృష్ణారెడ్డి ఎన్నిక
► ఆత్మకూరు మండలపరిషత్ రెండవ ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్ నాయక్ ఎన్నిక
► బత్తలపల్లి మండలం రెండోవ వైస్ ఎంపీపీగా వెంగళరెడ్డిని ఎంపిక చేసి నియామక పత్రాన్ని అందజేసి ప్రామాణస్వీకారం చేయించిన అధికారులు.
► హిందూపురం మండల రెండవ వైస్ ఎంపీపీగా గోళ్ళపురం రామాంజనేయులు ఎన్నిక
►లేపాక్షి మండల రెండవ వైస్ ఎంపీపీ గా కల్లూరు లీలావతి ఎన్నిక
►చిలమత్తూరు మండల రెండవ వైస్ ఎంపీపీ గా అంజలీదేవి ఎన్నిక.. ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు.

తాజా వీడియోలు

Back to Top