వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. పోరుమామిళ్లలో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దళిత పక్షపాతి అన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. దళితులు ఉన్నత చదువులు చదవాలని ప్రత్యేక పథకాలు తెచ్చారన్నారు. రోజుకు ఒకసారి పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు.