ప్రతి రాష్ట్రం మనల్ని అనుసరిస్తుంది

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోందని, ప్రతి రాష్ట్రం మనల్ని అనుసరిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రానిధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కోవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపి దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అనుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. డబ్ల్యూహెచ్‌వో కూడా ఆరా తీస్తోందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

 

తాజా వీడియోలు

Back to Top