ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ? 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 

విశాఖ‌:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాజ‌కీయంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు బుధ‌వారం ట్వీట్ చేశారు. తెలంగాణాలో టీడీపీ ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుంది. కేంద్రంలో బిజెపి ఉంటుంది. అందులోకి పంపించిన ఎంపీలు పొత్తుల కోసం లాబీయింగ్ చేస్తుంటారు. తమరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారు. ఏ ఎన్నికలొచ్చినా వామపక్షాల కాళ్లూ పట్టుకుంటారు. ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ? అంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమేకాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను ప్రశ్నించలేకపోయాడు. అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను తాకట్టు పెట్టాడు అంటూ మ‌రో  ట్వీట్ చేశారు. 

పార్టీ లోని ముఖ్య నేత ఎవరైనా ప్రత్యర్థి పక్షంలోకి ఫిరాయిస్తే ద్రోహం చేశాడనో, విలువలు లేనివాడనో విమర్శలు రావడం చూస్తుంటాం. టీ-టీడీపీ అధ్యక్షుడు టీఆరెస్ లో చేరితే అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపినంత హుషారు కనిపిస్తోంది పచ్చ పార్టీలో. కేసుల రాజీ కోసమే ఈ పాట్లు అంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top