మ‌రెన్నో సంతోష‌క‌ర‌మైన పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం వైయ‌స్ జగన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా..అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top