చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు చంద్రబాబు తీరు

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: ఇసుక కొరత అంటూ చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.  'ఇసుక దొరక్క కూలీలు పస్తులుంటున్నారని అంటాడు. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అదే నోటితో నింద వేస్తాడు. పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుందని ఆరోపిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు. తను సృష్టించిన ఇసుక మాఫియా ఆదాయం కోల్పోయి బిక్క చూపులు చూస్తోందనేదే ఆయన అసలు బాధ' అని ట్వీట్ చేశారు.

'చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా చంద్రబాబు గారి క్రిమినల్ మైండ్ షార్ప్ గానే పనిచేస్తోంది. నిరసన ప్రదర్శనలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా మరో పార్టీతో చేయించే స్కెచ్ వేశాడు. లాంగ్ మార్చో, షార్ట్ మార్చో. స్పాన్సర్ చేసేది ఆయనే అని అందరికీ తెలిసిపోయింది' అని విజయ సాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 

Read Also: ఇసుక కొరతను రాజకీయం చేయడం సిగ్గుచేటు

తాజా ఫోటోలు

Back to Top