మీరు నిప్పో..తుప్పో ప్రజలే చెబుతారు.

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి
 

అమ‌రావ‌తి:  రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అమాయకపు రైతుల పొట్టకొట్టారని  ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొద్ది రోజులు ఆగితే అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుందని ట్విటర్‌ వేదికగా హెచ్చరించారు. ‘ కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్‌సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్‌గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’  అని విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

పదవి, ప్యాకేజీ కోసం జ్యోతుల నెహ్రూ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అసాధ్యమని తెలిసినా 5శాతం రిజర్వేషన్‌ ప్రకటించినందుకు బాబును నెహ్రూ పొగిడారని విమర్శించారు. ‘కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అసాధ్యమని తెలిసీ 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బాబును పొగిడింది మీరే కదా? ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

 

 

Back to Top