ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ  మేర‌కు బుధ‌వారం విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ అప్పు 169 శాతం పెరిగింది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులు 55 శాతానికి తగ్గాయి. కార్పొరేట్ల ప్రయోజనాలకే ఖజానాలో సొమ్మును టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. పేద ప్రజల కలల నెరవేర్చేందుకు సీఎం వైయ‌స్ జగన్ పెట్టుబడి పెడుతున్నారు. టీడీపీకి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

 

Back to Top