తాడేపల్లి: తెలుగు దేశం పార్టీ పొత్తులపై అనుసరిస్తున్న తీరును వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎండగట్టారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే టోటల్ డ్రామాస్ పార్టీ (TDP) ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇంగ్లిష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సిపిఎం రాఘవులు గారు అన్నారంటే తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అంటూ మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.