'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు చెల్లీ? 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు 'జాతీయ నేత'గా ఉండి 'జాతి నేత'గా ఎందుకు మారారు? మీ సొంతఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బిజెపి నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో  MPTC, ZPTCలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి  మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా!

 రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? కొంపదీసి 'మా బావ కళ్లల్లో ఆనందం కోసం' అని నిజం చెబుతారా?. ఇదే కదా మీకు బిజెపి పట్ల ఉన్న చిత్తశుద్ధి!

 వెనకటికి ఒకామె...ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Back to Top