40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైంది?

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
 

 అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.  మద్యం ధరలను పెంచి మందుబాబుల పొట్ట కొడుతున్నారంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారని మండిపడ్డారు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వం భావిస్తుంటే అడ్డుపడతారని అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైనా దర్యాప్తు చేయవద్దంటారని దుయ్యబట్టారు. తన మాజీ పీఎస్ ఐటీ అధికారులకు అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటారని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏమైందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 
 

తాజా వీడియోలు

Back to Top