చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది

వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ 
 

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర’కు పార్టీ కార్యకర్తల నుంచి కూడా స్పందన రావడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చప్పట్లు కొట్టాలని చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు... ‘‘గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

మామూలు విషయం కాదు
తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైన విషయం తెలిసిందే. వీటి ఆధారంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి ట్విటర్‌లో స్పందించారు. ‘‘బాబు వెళ్లి కలిసిన వారంతా నడినెత్తిన శని తాండవం చేసినట్టు గిలగిలా కొట్టుకుంటున్నారు. తీహార్ జైలు కెళ్లిన వారు, ఐటీ, ఈడీ నోటీసులందుకున్న పెద్దలు సారు ‘స్పర్శ’ కరోనా వైరస్ కంటే పవర్ ఫుల్ అని నిర్దారించారు. అహ్మద్ పటేల్ లాంటి ఉద్దండులకూ హవాలా ఉచ్చు బిగిసిందంటే మామూలు విషయమా?’’ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు

తాజా వీడియోలు

Back to Top