అందుకే సుజనా చౌదరి బట్టలు చింపుకుంటున్నారు 

ఎంపీ విజయసాయి రెడ్డి
 

 విజయవాడ: అమరావతిలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి భూములున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ చేసిన సంచలన ప్రకటనపై బీజేపీ నేత సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని పేర్కొనడంపై విజయసాయి రెడ్డి స్పందించారు.  రాష్ట్రాల రాజధానుల ఎంపిక కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని చట్టసభల సభ్యులందరికీ తెలుసు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఈ విషయం స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కోవర్టు సుజనా చౌదరి మాత్రం కేంద్రం చూస్తూ ఊరుకోదని బట్టలు చింపుకుంటున్నాడు. అసలు విషయమేమిటంటే, అమరావతిలో ఆయనకు భూములున్నాయి' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top