లై డిటెక్టర్ ను కూడా బురిడీ కొట్టించగల గజదొంగలు ఆ ఇద్దరూ

చంద్రబాబు, లింగమనేనిపై విజయసాయిరెడ్డి ఫైర్‌ 
 

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు, లింగమనేని రమేష్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరూ లై డిటెక్టర్‌ను కూడా బురిడీ కొట్టించగల గజదొంగలని విమర్శించారు. చంద్రబాబు తన నివాసం గురించి వ్యాఖ్యానిస్తూ, కరకట్ట గెస్ట్ హౌస్ ను ప్రభుత్వానికి ఇచ్చేశా అని బినామీ అంటాడని, ల్యాండ్ పూలింగ్ కింద గుంజుకున్నాం అని బాసు వీడియోల సాక్షిగా చెప్పారని ట్వీట్ చేశారు. ఇప్పుడా గెస్ట్ హౌస్ బినామీ సొంతం అయిందని తెలిపారు. ప్రజలకు కళ్లు, చెవులు పనిచేయవనుకుంటున్నారో ఏమిటో అంటూ వ్యాఖ్యానించారు. ఏదేమైనా లై డిటెక్టర్ ను కూడా బురిడీ కొట్టించగల గజదొంగలు ఆ ఇద్దరు అంటూ విమర్శించారు. ప్రభుత్వం నుంచి కూల్చివేత నోటీసులు అందుకున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు అన్ని అనుమతులు ఉన్నాయని లింగమనేని రమేశ్ చెబుతుండడం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం అది అక్రమ కట్టడమేనని అంటోంది.
 

Back to Top