బీహార్ గడ్డి కుంభకోణం కన్నా నీరు-చెట్టు స్కామ్ పెద్దది

విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి

ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ:  మాజీ సీఎం చంద్రబాబునాయుడి హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారిస్తే అవన్నీ బయటకు వస్తాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. బీహార్ లో జరిగిన పశువుల దాణా కుంభకోణం కన్నా, నీరు-చెట్టు స్కామ్ పెద్దదని ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది" అని అన్నారు. 
 

Back to Top